పేద పిల్లల కోసం సుమ సంచలన నిర్ణయం.. గొప్ప మనస్సు అంటూ?

యాంకర్ సుమకు రోజురోజుకు అవకాశాలు తగ్గుతున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాత్రం సుమ తనకు తాను సాటి అని ప్రూవ్ చేసుకుంటున్నారు.తాజాగా సుమ పేద పిల్లల కోసం సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

30 మంది పేద పిల్లలకు సుమ జీవితాన్ని ఇచ్చారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.యాంకర్ గా సుమ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి.

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో సుమ స్థాయిలో మరెవరూ సత్తా చాటలేకపోయారు.తెలుగు ఏ మాత్రం తడబడకుండా మాట్లాడే సుమ అవతలి వ్యక్తులు వేసే పంచ్ లకు కొన్ని సెకన్ల గ్యాప్ లోనే రివర్స్ పంచ్ వేయగల ప్రతిభ ఉండటంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

సుమ హోస్ట్ గా వ్యవహరిస్తే మినిమం గ్యారంటీ రేటింగ్స్ వస్తాయని టాక్ ఉంది.ఈ రీజన్ వల్లే సుమకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Advertisement

యాంకర్ గా సుమ సంపాదించిన ఆస్తుల విలువ తక్కువేం కాదు.30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఆ 30 మంది కెరీర్ పరంగా సెటిల్ అయ్యే వరకు వాళ్ల బాధ్యతను నేనే తీసుకుంటానని సుమ చెప్పుకొచ్చారు.

ఆ విద్యార్థులకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని సుమ తెలిపారు.సుమ మంచి మనస్సుకు ఫిదా అయ్యామని ఫ్యాన్స్ చెబుతున్నారు.

15 సంవత్సరాల వయస్సులో యాంకర్ గా కెరీర్ మొదలైందని సుమ తెలిపారు.చేయాలనుకున్నది సరిగ్గా చేస్తే మాత్రమే మంచి పేరు వస్తుందని ఆమె అన్నారు.నేను టీచర్ కావాలని అనుకుని యాంకర్ అయ్యానని ఆమె వెల్లడించారు.

యాంకర్ సుమ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు