ప్రతి అమ్మాయ్ అలా అవ్వాలంటున్న యాంకర్ రవి!

బుల్లితెర యాంకర్ రవి గురించి మనకు తెలిసిందే.

ఒకప్పుడు బిగ్ బాస్ లాస్య తో యాంకరింగ్‌ ప్రయాణంను మొదలు పెట్టిన తను ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఒకేసారి ఎన్నో ఆఫర్లతో బిజీగా ఉంటున్న రవి మొదట్లో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో దాచాడు.

2017 లో అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాలో హీరోగా తెరకెక్కాడు.నిజానికి రవి కి నటుడిగా కంటే యాంకరింగ్ విషయంలో మంచి గుర్తింపు ఉంది.ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానల్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేస్తున్నారు.

అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లకు కూడా తన వంతు పాత్ర చేస్తుంటాడు.ఇదిలా ఉంటే తన వ్యక్తిగత విషయంలో తన కుటుంబం గురించి ఎప్పుడు చెప్పని రవి ఒకసారి తనకు పెళ్ళయిందని ఓ పాప కూడా ఉందని చెప్పగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

Advertisement

ఇక అప్పటి నుంచి తన కుటుంబం గురించి బయటపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తన కుటుంబంతో సహా వీడియో లు చేస్తూ షేర్ చేస్తూంటాడు.ఇదిలా ఉంటే ఇటీవల తన భార్య పిల్లలతో కలిసి కొన్ని వీడియోలు చేయగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెళ్ళాం తో ఉండే బాధలు, వారితో కలిసి షాపింగ్ ఎలాంటి కష్టాలు ఉంటాయో లాంటి వీడియోలను చేయడంతో వాటికి అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

అంతే కాకుండా తన కూతురు వియా తో కలిసి ఆకట్టుకునే వీడియోలను చేస్తుంటాడు.ఇంతకుముందు ఓ కార్యక్రమంలో తన కూతురు పాల్గొనగా.తన కూతురు తో ఆడుకుంటూ ఎమోషనల్ గా ఫీల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా జనవరి 26 సందర్భంగా వీడియోని విడుదల చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఈ వీడియోలో తన కూతురు వియా కు‌ స్వాతంత్ర సమరయోధురాలి ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణను వేయించాడు.ఝాన్సీ లక్ష్మీబాయి తన పిల్లాడిని వీపుకు కట్టుకొని పోరాటం చేసిన దృశ్యాన్ని తన కూతురు తో వేయించాడు రవి.ఈ వీడియోలో తన పాప ఎంతో బాగా నటించింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.

ప్రతి ఒక అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో యోధురాలిగా మారాల్సిందే అని రవి తెలిపాడు.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు