సుమ, ప్రదీప్‌లకు భారీగా తగ్గించారట

తెలుగు బుల్లి తెరపై మళ్లీ షూటింగ్స్‌ సందడి మొదలైంది.దాదాపుగా మూడు నెల పాటు షూటింగ్స్‌ లేకపోవడంతో భారీ నష్టాలు వాటిల్లాయి.

సీరియల్స్‌ మరియు షోలు షూటింగ్స్‌ ప్రారంభం అయ్యి ప్రసారానికి సిద్దం అయ్యాయి.ఈ సమయంలోనే తెలుగు బుల్లి తెరను షేక్‌ చేసే యాంకర్స్‌ పారితోషికాలు తగ్గించినట్లుగా తెలుస్తోంది.

ఈటీవీలో ప్రసారం అయ్యే షోలను మల్లెమాల వారు నిర్మిస్తారు.మల్లెమాల నిర్మాణంలో వచ్చే షోలు అన్ని కూడా సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి.

ఈటీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు హోస్ట్‌లుగా వ్యవహరించే సుమ, ప్రదీప్‌లతో పాటు పలువురికి పారితోషికాలు భారీగా తగ్గించారట.లక్షన్నర పారితోషికంను సుమ ఒక్క ఎపిసోడ్‌కు తీసుకుంటుంది.

Advertisement

క్యాష్‌ కార్యక్రమం కోసం సుమ తీసుకునే పారితోషికంను భారీగా తగ్గించారట.లక్షన్నర నుండి లక్ష రూపాయలకు పారితోషికంను తగ్గించారనేది టాక్‌.

ఇక ప్రదీప్‌ పారితోషికంలో కూడా దాదాపుగా 35 శాతం కోత విధించారట.దాంతో ఆయన కూడా తక్కువ పారితోషికంను అందుకుంటున్నాడు.

జబర్దస్త్‌ కామెడియన్స్‌కు కూడా గతంలో మాదిరిగా భారీగా పారితోషికాలు ఇవ్వడం లేదు.టీమ్‌ లీడర్‌ నుండి కంటెస్టెంట్స్‌ వరకు అందరికి కూడా పారితోషికంలో మార్పులు చేర్పులు చేయడం జరిగిందట.అనసూయ మరియు రష్మిల పారితోషికంను 25 శాతం తగ్గించారట.

మొత్తానికి కరోనా ఎఫెక్ట్‌ బుల్లి తెర యాంకర్స్‌ మరియు నటీనటులపై కూడా భారీగా పడ్డట్లుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు