రెచ్చిపోయిన అధికారి.. రైతును కాలితో తన్ని..15 ఏళ్ల బాలికను ఈడ్చుకుంటూ..!

కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు రెచ్చి పోతూ ఉంటారు.వాళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

సామాన్య ప్రజలపై తిరగబడి వాళ్లపై అమాన్యుషంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతుంటారు.ప్రజలకు సహాయం చేయాల్సిన అధికారులే వాళ్ళ పై అధికారం ఉందని ప్రతాపం చూపిస్తే.

ఇక సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతారు.తాజాగా రాజస్థాన్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఒక అధికారి చేసిన పనికి నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.అధికారులకు రైతులకు మధ్య జరిగిన వాగ్వివాదంలో ఒక అధికారి చేసిన పనికి అందరు అతడిని ఏకి పారేస్తున్నారు.

Advertisement

ఆ అధికారి ఒక రైతును కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా ఒక చిన్నారిపై చేసిన ఘటనకు అక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

అసలు ఆ అధికారి ఎందుకు అంతటి అరాచకానికి పాల్పడ్డాడో తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.రాజస్థాన్ రాష్ట్రంలోని జలోరి జిల్లాలో శంఖోర్ గ్రామంలో రైతులకు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

ఈ ఘటనలో అక్కడ ఉన్న ఒక అధికారి రెచ్చిపోయి రైతును కాలితో తన్నడంతో అక్కడ ఉన్న రైతులకు అధికారులకు మధ్య కొట్లాట జరిగింది.

పోలీసులు వచ్చిన కూడా చాలా సేపు ఆపలేక పోయారు.మాలా ప్రాజెక్టులో భాగంగా అధికారులకు, రైతులకు ఘర్షణ జరిగింది.కేంద్రం ఎక్సప్రెస్ హైవే 754 నిర్మిస్తుండగా ఆ పనులను రైతులు అడ్డుకున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

కారణం.రైతుల భూములకు సరైన నష్ట పరిహారం ఇవ్వలేదని వాళ్ళు వాపోతున్నారు.

Advertisement

అక్కడ ప్రతుతం మార్కెట్ విలువ ఎకరానికి 10 లక్షల వరకు ఉండగా అధికారులు మాత్రం కేవలం 45 వెల్ రూపాయలు మాత్రమే ఇచ్చారని.రైతులు చెబుతున్నారు.

ఆ నష్ట పరిహారం కూడా 90 శాతం మంది రైతులకు అందలేదని చెబుతున్నారు.

ఈ విషయంపై రైతులు కోర్టుకు వెళ్లగా ప్రస్తుతం తీర్పు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.తీర్పు వచ్చేవరకు రోడ్డు నిర్మాణ పనులు జరగ కూడదని రైతులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఒక అధికారి రైతును కాలితో తన్నడమే కాకుండా.15 ఏళ్ల బాలికను బండి వెంట ఈడ్చుకుంటూ వెళ్లి కొంతదూరం వెళ్ళాక వదిలేసాడు.ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యారు.

దీంతో ఆ ఊరు ప్రజలు గొడవకు దిగారు.చివరికి పోలీసులు వచ్చినా వారిపై కూడా గొడవకు దిగారు.

తాజా వార్తలు