మెగా వేడుకలో బాలీవుడ్‌ స్టార్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్బంగా ఈనెల 22న భారీ వేడుకలు నిర్వహించనున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే పార్క్‌ హయత్‌ హోటల్‌ అందుకు సిద్దం అవుతోంది.

మరో రెండు రోజుల్లో జరుగనున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నుండి అమీర్‌ ఖాన్‌ మరియు అమితాబచ్చన్‌లు హాజరు కాబోతున్నారు.వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్‌ సైతం వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక బాలీవుడ్‌ నుండే కాకుండా టాలీవుడ్‌ నుండి సైతం ప్రముఖ నటీ నటులు ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు.22వ తారీకు సాయంత్రం సమయంలో ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా మెగా సన్నిహితులు చెబుతున్నారు.ఈ వేడుకలో చిరంజీవి తన 150వ సినిమా విశేషాలతో పాటు, రామ్‌ చరణ్‌ తన తాజా చిత్రం టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్‌ చేయబోతున్నారు.

పుట్టిన రోజున ఫస్ట్‌లుక్‌ మరియు మంచి వార్త వినే అవకాశముందని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.చిరంజీవి పుట్టిన రోజు వేడుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో లైవ్‌ కవరేజ్‌ కానుంది.

గత మూడు నెలలుగా మెగా ఫ్యాన్స్‌ ఈ సందడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తాజా వార్తలు