11 మంది విద్యార్ధుల మరణాలు.. ఇండియన్ స్టూడెంట్స్‌ను అమెరికా ఆకర్షిస్తూనే వుంది : భారత సంతతి విద్యావేత్త

అమెరికాలో( America ) ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకు దాదాపు 11 మంది భారతీయ, భారత సంతతి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాలు భారత్‌లోని విద్యార్ధుల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే ఇలాంటి పరిస్ధితుల్లోనూ భారత్ నుంచి విద్యార్ధులను( Indian Students ) స్వాగతించే వాతావరణాన్ని యూఎస్( US ) అందిస్తూనే వుందని భారత సంతతికి చెందిన విద్యావేత్త అన్నారు.విద్యార్ధుల మరణాల నేపథ్యంలో అమెరికాలోని భారతీయ మిషన్‌లు పిల్లలతో సన్నిహితంగా వ్యవహరించడం ప్రారంభించాయి.

ఇందులో సాధారణ బహిరంగసభలు, విద్యార్థి సంఘాలతో పరస్పర చర్యలు వున్నాయి.

Amid Deaths Of 11 Indian Students This Year Us Continues To Offer Welcoming Envi

వర్జీనియా రాష్ట్రంలోని( Virginia ) జార్జ్ మాసన్ విశ్వవిద్యాలంలో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డివిజనల్ డీన్ గురుదీప్ సింగ్( Gurdip Singh ) పీటీఐతో మాట్లాడుతూ.ఈ ఏడాది విద్యార్ధుల మరణాలపై విచారం వ్యక్తం చేశారు.ఆకస్మాత్తుగా ద్వేషపూరిత నేరాలు జరగడానికి స్పష్టమైన కారణాలు లేవన్నారు.

Advertisement
Amid Deaths Of 11 Indian Students This Year US Continues To Offer Welcoming Envi

ఒకే విశ్వవిద్యాలయంలో మూడు , నాలుగు ఘటనలు జరిగితే తాను మరింత ఆందోళన చెందుతానని గురుదీప్ అన్నారు.కానీ తనకున్న అవగాహన ప్రకారం.ద్వేషపూరిత నేరాలకు అంతర్లీన కారణం తనకు కనిపించడం లేదన్నారు.

వరుస ఘటనల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని సింగ్ హెచ్చరించారు.జాబ్ మార్కెట్( Job Market ) మునుపటి సంవత్సరం కంటే గొప్పగా లేనందున విద్యార్థులలో ఆందోళన ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

Amid Deaths Of 11 Indian Students This Year Us Continues To Offer Welcoming Envi

ఈ విషయంలో యూనివర్సిటీల స్థానం కూడా ముఖ్యమైనదని హైలైట్ చేస్తూ.కొన్ని పరిసరాలు, కొన్ని ప్రదేశాలలో నేరాల రేటు ఎక్కువ వుందన్నారు.అదృష్టవశాత్తూ అమెరికాలో యూనివర్సిటీ నగరాలు, పట్టణాలు చాలా సురక్షితమైనవని గురుదీప్ చెప్పారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్( Institute of International Education ) నివేదిక ప్రకారం.అమెరికాలో భారతీయ విద్యార్ధుల సంఖ్య 2014-2015లలో 1,32,888 వుండగా.అది 2024 నాటికి 3,53,803కి పెరిగింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

గణనీయ స్థాయిలో భారతీయ విద్యార్ధులు వున్న క్యాంపస్‌లలో భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం పలు యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తోంది.ఏదైనా అత్యవసర పరిస్ధితులు తలెత్తితే స్పందించేందుకు దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు