అమెరికాలో పిల్లల తల్లి తండ్రులకు అమెరికా సిడిసి హెచ్చరిక...!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా అలజడి తగ్గుముఖం పడుతున్న క్రమంలో అమెరికన్స్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఉన్న పళంగా ఊడి పడ్డట్టుగా మరో మహమ్మారి మంకీ పాక్స్ రూపంలో విరుచుకు పడుతోంది.

మంకీ పాక్స్ మెల్ల మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది.

ఇప్పటి వరకూ సుమారు 19 వేల మందికి మంకీ పాక్స్ సోకినట్టుగా నివేదికలు వెల్లడవుతున్నాయి.ఇంకా పూర్తిగా కరోనా నుంచీ కోలుకోక ముందే మంకీ పాక్స్ విస్తరిస్తుండటంతో అమెరికా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో మంకీ పాక్స్ కేసుల నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా వ్యాప్తంగా సుమారు 11 రాష్ట్రాలలో మంకీ పాక్స్ కేసులు ఉన్నాయని, ఈ మహమ్మారి మిగిలిన రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.అంతేకాదు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.

Advertisement

ఈ మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది.ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 31 మంది చిన్నారులకు మంకీ పాక్స్ సోకిందని ప్రకటించింది.

ఇదే విషయాన్నీ స్థానిక మీడియా కూడా ప్రచురించింది.ఇదిలాఉంటే.సిడిసి అమెరికాలోని పిల్లల తల్లి తండ్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.8 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకు మంకీ పాక్స్ సోకితే తీవ్ర ఆనారోగ్య పాలవుతారని హెచ్చరించింది.మంకీ పాక్స్ సోకినా 11 రాష్ట్రాలలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 9 మంది పిల్లలు ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది.

పిల్లలను తల్లి తండ్రులు ఎప్పటి కప్పుడు గమనిస్తూ వారికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా సరే ముందుగానే గమనించి వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని సిడిసి సూచించింది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు