ఏపీఎస్ ఆర్టీసీ తరహాలోనే టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించింది.బెంగళూరు, విజయవాడలకు నడిచే గరుడ, రాజధాని బస్సుల్లో 10 శాతం ఛార్జీలను తగ్గిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
శుక్ర, ఆది వారాలు మినహా మిగతా రోజుల్లో ఈ ఆఫర్ వర్తించనుంది.అయితే ఈ ఛార్జీలు తగ్గింపు తాత్కాలికంగా ఈనెలాఖరు వరకు మాత్రమే అమల్లో ఉండనుందని స్పష్టం చేసింది.