గత వారం రోజులుగా తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున జరగాల్సి ఉంది.కానీ అనివార్య కారణాల వల్ల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
కార్యక్రమం కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూశారు.రాజమౌళి ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఓకే చెప్పారు.
కానీ సినిమా యూనిట్ సభ్యులు అనూహ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సల్ చేసి ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఉత్సాహంలో నీరుగార్చారు.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు, ఆయన తదుపరి సినిమా గురించి ఏమైనా మాట్లాడతాడా అంటూ ఎన్నో రకాలుగా చర్చలు జరిగాయి.
కానీ చివరకు అసలు ఈవెంట్ లేకుండా పోయింది అంటూ నందమూరి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియ రాలేదు.
కానీ ఏదో బలమైన కారణం ఉండడం వల్లే ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత కార్యక్రమంలో క్యాన్సల్ చేశారు అంటూ సమాచారం అందుతుంది.ఆ బలమైన కారణమేంటి అనేది రేపు లేదా ఎల్లుండి వరకు తెలిసే అవకాశం ఉంది.
రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా లో అమితా బచ్చన్ మరియు నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమా తెలుగులో రాజమౌళి సమర్పణలో రాబోతున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాలున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడంతో సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.