అమెరికాలో ఎన్నారైలకి కష్టాలు తప్పేలా లేవు..

అమెరికాలో వీసా విధానాలపై సమూల మార్పులు తీసుకురావాలని ట్రంప్ ముందు నుంచీ ఆదేశాలు ఇస్తూ ,వలసవాసులకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే హెచ్ -1 బీ వీసా విషయంలో విధించిన నిభందనలు అందరి తెలిసినవే.

అయితే గతంలోనే హెచ్ -1 బీ వీసా దారుల భాగస్వాముల పని అనుమతి విషయంలో మరో అడుగు ముందుకు వేశారు ట్రంప్.తాజాగా హెచ్‌-1బీ వీసా దారుల భాగస్వాములకి పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియని వేగా వంతం చేశారు.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్ -1బీ వీసా దారుల జీవిత భాగస్వాముల పని అనుమతులు తొలిగించే విషయంలో ఇటీవల నోటీసులు జారీ చేశారు.తాజాగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నట్టుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రతిపాధనలకి గనుకా అనుమతులు లభిస్తే వాటిని ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు.ఆ తరువాత కొత్త ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు దాదాపు 30-60 రోజుల వరకు వీలు ఉంటుంది.

Advertisement

అయితే ఈ ప్రక్రియ జరగడానికి కనీసం ఏడాది సమయం అయిన పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.గతంలో అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది.

ఇప్పుడు ట్రంప్ గనుకా కొత్త నిభందనలు అమలులోకి తెస్తే హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబాలలో కేవలం ఒకరు మాత్రమే ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది.ఆర్ధికంగా వారు నష్టపోయే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు.

Advertisement

తాజా వార్తలు