Krishna Vavilala Presidential Lifetime Achievement : అమెరికా : తెలుగు ఎన్నారై కి అరుదైన గౌరవం...వరించిన ప్రెసిడెన్షియల్ అవార్డ్...!!

అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు వాసిని అరుదైన పురస్కారం వరించింది.అమెరికాలో అత్యున్నత పురస్కారాలలో ఒక్కటైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.ఆంధ్ర రాష్ట్రం నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే ఎంతో మంది తెలుగు వారు అమెరికాకు వలసలు వెళ్ళారు.

అలా వెళ్ళిన వాళ్ళు అక్కడే స్థిరపడి ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఎనో సేవా చైతన్య కార్యక్రమాలను చేపట్టారు.

కేవలం వలస వచ్చిన తెలుగు వారికోసమే కాకుండా స్థానికంగా ఉన్న అమెరికన్స్ కు కూడా ఎంతో సాయం చేస్తూ వచ్చారు.ఈ కోవకు చెందిన వారే ఇప్పటి ప్రెసిడెన్షియల్ అవార్డ్ గెలుచుకున్న వావిలాల కృష్ణ.అమెరికాలోని హ్యుస్టన్ లో స్థిరపడిన వావిలాల భారతీయ సమాజానికి, అమెరికా సమాజానికి ఎన్నో సేవలు అందించారు.2006 లో హ్యుస్టన్ వర్సిటీ లో ఇండియన్ ప్రోగ్రామ్ ను స్థాపించారు.ఈ క్రమంలోనే.

America: Rare Honor For Telugu Nri Presidential Award , Krishna Vavilala, Telug
Advertisement
America: Rare Honor For Telugu NRI Presidential Award , Krishna Vavilala, Telug

అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు దాంతో ఈ కోర్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ సేవ పురస్కారాన్ని అందిస్తారు.ఈ ఏడాదికి గాను గడిచిన వారం జరిగిన అవార్డుల ప్రదానోశ్చవం లో వావిలాల కృష్ణ కు ఈ అరుదైన అవార్డును అందించారు.వావిలాలకు అందించే ఈ అవార్డ్ లో అధ్యక్షుడు బిడెన్ సంతకం చేసిన పత్రంతో పాటు, మెడల్ ఉంటాయి.

ఇదిలాఉంటే వావిలాల కృష్ణ మాట్లాడుతూ తాను చేసిన సేవలకు గుర్తింపుగా నన్ను గౌరవించడం ఎంతో సంతోషంగా ఉంది.ఇది నేను భారతీయులకు చేసిన సేవలకు నిజమైన గుర్తింపని అన్నారు.

Advertisement

తాజా వార్తలు