అమెరికాలో కరోనాతో మృతి చెందిన కుటుంభాలకు ఆర్ధిక సాయం...!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మిగిల్చిన ఆర్ధిక, ప్రాణ నష్టం ఊహలకు కూడా అందదు.

యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన మహమ్మారి ముఖ్యంగా అమెరికాపై తీవ్రమైన ప్రభావం చూపించింది.

ఏ దేశంలో కూడా నమోదు కాని మృతుల సంఖ్య అమెరికాలో నమోదయ్యింది.ఎంతో మంది అమెరికన్స్ తీవ్రంగా నష్టపోయారు.

అయితే బిడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నష్ట నివారణ చర్యలు చేపట్టే క్రమంలో ఆమోదించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇప్పుడు మృతుల కుటుంభాలకు ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది.భారీ ఉద్దీపన ప్యాకేజీ లో పలు వ్యాపారాలు, నిరుద్యోగులకు ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో కరోనాతో చనిపోయిన కుటుంభాలకు అంత్యక్రియలకు అయ్యిన మొత్తాన్ని ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది.అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్ -2021 ద్వారా మృతుల కుటుంభాలకు ఈ ఆర్ధిక సాయం అందించ నుంది.

Advertisement

అయితే ఈ సాయం పొందటానికి ఎవరెవరు అర్హులు అనే నియమాలు కూడా తెలిపింది.- మరణించిన వ్యక్తి కరోనాతో మృతి చెంది ఉండాలి.

అంతేకాదు అమెరికా భూభాగాలు, కొలంబియా -డిస్ట్రిక్ట్ లో మరణించి ఉండాలి.- మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ కరోనాతో మృతి చెందినట్టుగా నిర్ధారించి ఉండాలి - దరఖాస్తు చేసుకున్న వారు 2020 జనవరి 20 తరువాత అంత్యక్రియల కోసం డబ్బు ఖర్చు చేసిన అమెరికా పౌరుడు నాన్ సిటిజన్, లేదా అర్హత పొందిన ఇతరులు అవ్వాలి ఈ దరఖాస్తులను ఏప్రియల్ నెల నుంచీ స్వీకరించనుంది ఫెమా ( ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ యాక్ట్ ). అయితే దరఖాస్తు తో పాటుగా ఎలాంటి పత్రాలు పొందుపరచాలో కూడా తెలిపింది.మరణ ధృవీకరణ పత్రం, అంత్య క్రియలు జరిపినపుడు ఇచ్చే పత్రం ఆ సమయంలో ఇచ్చే రసీదులు, ఫ్యునరల్ హోమ్ కు చెందిన ఫోన్ నంబర్స్ , అడ్రస్.

ఇక అంత్య క్రియల కోసం ఏదైనా స్వచ్చంద సంస్థ, లేక విరాళాలు తీసుకోవడం, ప్రభుత్వ ఏజెన్సీ లు డబ్బులు ఇచ్చి ఉంటే ఫెమా ఇచ్చే ఆర్ధిక సాయం అందదు.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు