అమెరికా ఎన్నిక‌లు.... తెలుగు వారి ఓట్లు ఎవ‌రికి..?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు రెండే రెండు.ఒక‌టి క‌రోనా వైర‌స్ అంతానికి వ్యాక్సిన్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుంది ?  రెండు.

అగ్ర‌రాజ్యం అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేనా? అనే!! దీంతో అమెరికాలో ఏం జ‌రుగుతున్నా  నిత్యం తాజా అప్‌డేట్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే తాజాగా వెలుగు చూసిన అంశం.

అమెరికాలో తెలుగువారి ఓట్లు ఎటు?  ఎవ‌రి ప‌ట్ల తెలుగు వారు సానుకూలంగా ఉన్నారు ? అనే విష‌యాలు.ప్ర‌స్తుత అమెరికా ఓట‌ర్ల లెక్క ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్ర‌జ‌లు అక్క‌డే స్థిర‌ప‌డిన వారు.2-5 శాతం ఉన్నారు.గెలుపు ఓట‌ముల‌ను వీరు తీవ్ర‌స్తాయిలో ప్ర‌భావం చేయ‌లేక‌పోయినా.

నెక్‌టు నెక్ కౌంట్ వ‌స్తే.మాత్రం వీరి ఓట్లు అధ్య‌క్షుడిని నిర్ణయించ‌డంలో  కీల‌కంగా మార‌తాయి.

అంతేకాదు కొంద‌రు తెలుగు వారు అక్క‌డి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల్లో కీల‌క రోల్ పోషిస్తున్నారు.వారు కూడా ప్ర‌చార ప‌ర్వంలో కొన‌సాగుతున్నారు.

Advertisement

దీంతో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులుగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బిడెన్‌ల‌కు సంక‌టంగా మారింది.

మ‌రీ ముఖ్యంగా ట్రంప్ తెలుగు వారి ఓట్ల‌పై క‌న్నేశారు.అంతేకాదు, ఏకంగా భార‌తీయుల ఓట్ల‌పై ఆయ‌న చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.చివ‌రి నిముషంలో ఎటొచ్చి.

ఎటు వెళ్లినా.త‌న‌కు వీరి ఓట్లు క‌లిసి వ‌స్తాయ‌ని ట్రంప్ ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇటీవ‌ల కాలంలో న‌ల్ల‌జాతివారిపై దాడులు జ‌రుగుతున్నా.ట్రంప్ స‌మ‌ర్ధిస్తున్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..

అస‌లు మీరు మీ దేశాల‌కు వెళ్లిపోతే.మాకు కూడా ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని అన్నారు.

Advertisement

ఈ నేప‌థ్యంలో ట్రంప్‌కు ఇత‌ర దేశాల ఓట్లు ప‌డే ఛాన్స్ ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.గ‌త 2016లోనూ తెలుగు వారి ఓట్లు ఆయ‌న‌కు ప‌డ్డాయి.

ఈ విష‌యాన్ని ఆయ‌న అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు.ఇక‌, ఇప్పుడు కూడా ట్రంప్ ఆశ‌లు వీరిపైనే ఉన్నాయి.

కానీ, వీసాల విష‌యంలోను, ప‌ద‌వుల విష‌యంలోనూ భార‌త్‌ను ట్రంప్ చిన్న‌చూపుస్తున్నార‌నే భావ‌న ఇండియ‌న్ అమెరిక‌న్స్‌లో ఉంది.దీంతో ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు