తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.వ్యక్తిత్వ వికాసంపై నాట్స్ వెబినార్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం పై వెబినార్ నిర్వహించింది.

నాట్స్ తెంపాబె విభాగం చేపట్టిన ఈ వెబినార్ లో చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ స్వామి వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న మార్పులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది వివరించారు.

2.న్యూజెర్సీ లో తెలంగాణ తెలుగు అసోసిషన్ ఆధ్వర్యంలో సంబరాలు

తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాదాద్రి లక్ష్మీనరసింహాహస్వామి సంబరాలు వైభవంగా సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కాన్ఫిరెన్స్ కమిటీ కన్వీనర్ గనగోని శ్రీనివాస్, అధ్యక్షుడు పాటలోళ్ళ మోహన్ రెడ్డి తెలిపారు.

3.దుబాయ్ లో ప్రవాసులు శుభవార్త

దుబాయిలో ఉండే ప్రవాసులకు శుభవార్త .దుబాయ్ సూపర్ సేల్స్ ప్రారంభం అయ్యాయి.తాజాగా దుబాయ్ ఫెస్టివల్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిషమెంట్ కి సంబండఁచి తేదీలను ప్రకటించింది.మే 27 నుంచి 29 వరకు దుబాయ్ సూపర్ సేల్స్ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.

4.భారత ఉప రాష్ట్రపతి ఖతార్ పర్యటన

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ పర్యటన ఖరారయ్యింది .ఈ నెల ౩౦ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వెంకయ్య మూడు దేశాల పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఖతార్ లో పర్యటించబోతున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తెలుగు ప్రవాసీలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.తన పర్యటనలో ఖతార్ యువరాజు షేక్ అబ్దుల్లా బిన్ హమద్ తో వెనకయ్య నాయుడు భేటీ కానున్నారు.

5.మరో భారత సంతతి వ్యక్తికి బైడన్ కీలక పదవి

మరో ఇండియన్ అమెరికన్ కు బైడన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోంది.స్లో వేకియాకు కొత్త రాయబారిగా గౌతమ్ రానా ను ఎంపిక చేసేందుకు అమెరికా అధ్యక్షుడు నిరణయించుకున్నారు.

6.పాక్ లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు

ఎలక్ట్రానిక్స్ యంత్రాలు ( ఈవీఎం ) ల వినియోగాన్ని నిలిపివేయడం తో పాటు, ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేస్తూ పాక్ నేషనల్ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లుని ఆమోదించింది.

7.హిందూ మహాసముద్రం ప్రాంతంలో సునామీ హెచ్చరికలు

తూర్పు తైమూర్ తీరంలో శుక్రవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది.భూకంపం ప్రకంపనాలు తైమూర్ ద్వీప తూర్పు వైపు నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో వచ్చాయని గుర్తించారు.ఈస్ట్ తైమూర్ తీరంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

8.అమెరికాలో మంకీ ఫాక్స్ కలకలం

Advertisement

అమెరికాలో మంకీ ఫాక్స్ కేసులు రోజు రోజు కి పెరుగుతూనే ఉన్నాయి.దాదాపు ఏడు రాష్ట్రాల్లో మంకీ ఫాక్స్ కేసులను గుర్తించారు.

9.మహిళలపై తాలిబన్ల ఆంక్షలు.

తప్పుపట్టిన ఐక్యరాజ్యసమితి రాయబారి

మహిళలపై తాలిబన్లు విధిస్తున్న ఆంక్షలపై ఐక్యరాజ్యసమితి రాయబారి రిచర్డ్ బెన్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు