సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అమెజాన్ ప్రైమ్ క్లారిటీ.. 20 రోజులకే ఓటీటీ రిలీజంటూ?

వెంకటేశ్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) కాంబినేషన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.

అయితే సంక్రాంతి సీజన్ కు రిలీజ్ కావడం, వెంకటేశ్ 75వ సినిమా కావడం, ఈ సినిమాకు టార్గెట్ కూడా తక్కువగా ఉండటంతో సులువుగానే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు.

శైలేష్ కొలను గత సినిమాలు సైతం అంచనాలకు మించి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమాతో పోల్చి చూస్తే మిగతా సినిమాలకు బెటర్ టాక్ రావడంతో సైంధవ్ సినిమా( Saindhav ) కలెక్షన్ల విషయంలో నిరాశపరిచింది.అమెజాన్ ప్రైమ్ సైంధవ్ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్( amazon prime ) ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

శ్రద్ధా శ్రీనాథ్( Shraddha Srinath ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా నవాజుద్దీన్ సిద్దిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.చంద్రప్రస్థ అనే కల్పిత నగరంలో జరిగినట్టు ఈ సినిమాను చూపించారు.సైంధవ్ సినిమా కలెక్షన్ల విషయంలో నిరాశపరిచినా ఓటీటీలో హిట్ గా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సైంధవ్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.వెంకటేశ్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

ఫ్యామిలీ, కామెడీ, క్లాస్ సినిమాలు వెంకటేశ్ కు ఎక్కువగా సూట్ అవుతాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వెంకటేశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

వెంకటేశ్ కు యాక్షన్ కథాంశాలు సూట్ కావడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు