వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన అమెజాన్ సీఈఓ!

కరోనా కాలంలో ప్రజల జీవన విధానం దాదాపుగా మారిపోయింది.

అంత వరకు ఎప్పుడో వుదయం ఆఫీసుకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఎపుడో ఇంటికి వచ్చే వుద్యోగులు కరోనా( Corona ) పుణ్యమాని ఇంటికే పరిమితం అయ్యారు.

ఇంకేముంది, ఇంట్లోనే వుంటూ మనవాళ్లు హాయిగా వర్క్ చేసుకొనే వారు.ఓ వైపు వర్క్ చేసినట్టే వుండేది, మరోవైపు ఎంచకా కుటుంబానికి దగ్గరగా వుండే అవకాశం చిక్కేది.

ఈ క్రమంలో మనవాళ్లు ఆ జీవన విధానానికి బాగా అలవాటు పడిపోయారు.అయితే ఇపుడు పరిస్థితులు చాలావరకు చక్కబడ్డాయి.

Amazon Ceo Andy Jassy Warns Employees Disobeying Office Mandate Details, Global

దాంతో చాలా కంపెనీలు తమ వుద్యోగులను తిరిగి వెనక్కి రమ్మని కోరుతున్నై.ఈ లిస్టులో అమెజాన్( Amazon ) కూడా వుంది.దాంతో వర్క్ ఫ్రం హోం( Work From Home ) సంస్కృతికి స్వస్తి పలకాలని వారికి కంపెనీ యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

Advertisement
Amazon CEO Andy Jassy Warns Employees Disobeying Office Mandate Details, Global

మేనేజ్మెంట్ నిర్ణయాలను పాటించకపోతే ఉద్యోగులు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంగా చెబుతున్నాయి.ఈ నేపధ్యంలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని చెప్పింది.

వర్క్ ఫ్రం హోంకి స్వస్తి చెప్పాలని తెలిపింది.

Amazon Ceo Andy Jassy Warns Employees Disobeying Office Mandate Details, Global

కాగా ఈ నిర్ణయమే ఆ కంపెనీ ఉద్యోగుల్లో నిరసనలకు కారణం అవుతోంది.ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి ససేమిరా అంటున్నారు.అలాంటి వారికి అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ( Amazon CEO Andy Jassy ) తాజాగా లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు.

వారానికి కనీసం 3 రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని వర్క్ పాలసీని అమెజాన్ నిర్ణయించింది.ఎవరైనా ఉద్యోగులు దీనికి ఒప్పుకోకుంటే ఆమెజాన్ సంస్థలో ఉంటారో లేదో నిర్ణయించుకోవాలనీ సీఈఓ హెచ్చరించారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

సంస్థ నిర్ణయం పట్ల కొంత మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఉద్యోగులు మాత్రం ఆఫీసుకు వచ్చి సహోద్యోగులతో వ్యక్తిగతంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు