దానిమ్మ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యం( Health ) పై కాస్త శ్రద్ధ పెంచారు.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్లు మానవజాతిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

తగిన బరువు, సరైన ఆహారం ఉండేలా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజలు ఆహార నియమాలను పాటిస్తున్నారు.అప్పుడే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.అలాగే ఇలా చేస్తున్న కొంత మంది ప్రజలు రోజువారి ఆహారంలో కూరగాయలు పండ్లు ఉండేలా చేసి చూసుకుంటున్నారు.

పండ్లలో ముఖ్యంగా దానిమ్మ( Pomegranate )ను క్రమం తప్పకుండా తింటే గుండె ఆరోగ్యంతో పాటు జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

దానిమ్మ ఏ అనారోగ్య సమస్య ఉన్నవాళ్లైనా దీన్ని తినవచ్చు.దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యం నుంచి జీర్ణ క్రియ వరకు అన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. దానిమ్మ జ్యూస్( Pomegranate Juice ) అనేది పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మందికి సోడా, డ్రింక్స్ ఇతర ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్( Fruit Juices ) వంటి షుగర్ డ్రింక్స్ అలవాటై ఉంటుంది.

ఇందులో షుగర్ ఒక్కటే కాకుండా పెద్ద మొత్తంలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి.వీటిని తాగడం వల్ల శరీరంలో ఒక రకమైన కొవ్వు ఏర్పడుతుంది.

దీనికి ప్రత్యామ్నాయం గా దానిమ్మ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో దానిమ్మ జ్యూస్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియం,కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా అందుతాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) ఎక్కువగా ఉండడం వల్ల మెటబాలిజం వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది.ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్( Fiber ) ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది.దానిమ్మ జ్యూస్ రోజు తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉండడంతో పాటు రోజంతా హుషారుగా ఉంటారు.

Advertisement

దానిమ్మ లో నాణ్యమైన ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.రుచి కూడా బాగుండడంతో చాలామంది దానిమ్మ రసాన్ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు.

తాజా వార్తలు