మెంతి గింజల లో ఉండే ఆయుర్వేద గుణాలు.. ఈ సమస్యలకు దివ్య ఔషధమని తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే వంట గదిలో ఉండే మెంతులు( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

మెంతి గింజల లో ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే వీటిని ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతే కాకుండా మెంతి గింజలు సులభంగా అందుబాటులో ఉంటాయి.ఇళ్లలో ఉండే కుండీలలో కూడా వీటిని పెంచవచ్చు.

పెద్దగా ఖర్చు కూడా ఉండదు.మెంతి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మెంతులు జుట్టుకు( Hair Problems ) చాలా మేలు చేస్తాయి.రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు దూరం అవుతాయి.మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతి గింజలు ఉపయోగకరంగా ఉంటాయి.

రాత్రి అంతా నీటిలో వేసి ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినాలి.అంతే కాకుండా ఆ నీటిని కూడా తాగాలి.

దీని వల్ల రక్తంలో చక్కెర( Blood Sugar Levels ) అదుపులో ఉంటుంది.కడుపు నొప్పితో బాధపడుతుంటే రోజు ఏదో ఒక రూపంలో మెంతులని ఉపయోగించాలి.

దీని వల్ల కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుంది.మెంతి గింజలు లేదా మెంతి పొడిని ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఆకలి లేకుంటే మెంతి గింజల పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఆకలి వేస్తుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

పరిశోధనల ప్రకారం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు మెంతులలో ఎక్కువగా ఉన్నాయి.అలాగే మెంతికూర( Menthi Leaves )లో యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.మెంతి గింజలను నానబెట్టి దానీ పేస్టును చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తాజా వార్తలు