అమరావతి ఆర్-5 జోన్ కేసుపై రేపు సుప్రీంలో విచారణ

అమరావతి ఆర్ -5 జోన్ కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఆర్ -5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

హైకోర్టు ఉత్తర్వులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టిన తరువాత హైకోర్టు నిలిపివేయడం ఏంటని సర్కార్ పిటిషన్ లో పేర్కొంది.

మరోవైపు తమ వాదనలు వినకుండా కేసులో ఎటువంటి తీర్పును వెలువరించ వద్దని అమరావతి రైతులు సుప్రీం ధర్మాసనంలో కేవియట్ దాఖలు చేశారు.అయితే ఈ పిటిషన్లపై రేపు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు