క్షీణించిన అమరావతి ఎంపీ ఆరోగ్యం!

ముంబై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది.

కొద్దీ రోజుల క్రితం నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో ఆమెను ముంబై లోని అమరావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం విదితమే.

అయితే ఈ క్రమంలోనే ఆమె ఆగోర్యం ఉన్నట్టుండి క్షీణించడం తో హుటాహుటిన ఆమెను నాగర్ పూర్ లోని ఒక హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తుంది.దేశంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే కౌర్ భర్త ఎమ్మెల్యే రవి కి ఆగస్టు 6 న ఈ కరోనా బారిన పడగా, ఆ తరువాత కుటుంబ సభ్యులు అందరూ పరీక్షలు చేయించుకోగా ఏకంగా ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.దీనితో వారందరూ కూడా ప్రస్తుతం ముంబై లోని అమరావతి ఆసుపత్రిలోనే చేరి వైద్య చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే కౌర్ కు కూడా అక్కడే చికిత్స అందిస్తుండగా ఆమె ఆరోగ్యం క్షీణించడం తో నాగర్ పూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.కౌర్ కుటుంబంలో 12 మందికి కరోనా సోకిన విషయాన్నీ స్వయంగా దంపతులు ఇద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Advertisement

కరోనా సోకిన వారిలో కౌర్ అత్త,మామలు,పిల్లలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు.అయితే తమకు కరోనా పాజిటివ్ రావడం తో గత కొద్దీ రోజులుగా తమను కలిసిన వారంతా కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి అంటూ ఈ జంట సూచనలు కూడా చేశారు.

అయితే అందరి పరిస్థితి బాగానే ఉందనుకున్న సమయంలో కౌర్ ఆరోగ్యం క్షీణించడం తో నాగర్ పూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.బీజేపీ పార్టీలో ఉన్న నవనీత్ కౌర్ కు 2019 ఎన్నికల్లో ఎలాంటి సీటు కల్పించకపోవడం తో అమరావతి లోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు