Amala Paul :న్యూడ్ సీన్ లో నటించేందుకు సిద్ధం: హీరోయిన్ అమలాపాల్

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ అమలాపాల్( Amala Paul ) పేరు కూడా ఒకటి.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలలో కూడా ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలకు సంబంధించిన విషయాలలో వార్తల్లో నిలుస్తోంది.ఇటీవల కాలంలో గ్లామర్ రోల్స్ పక్కన పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బలమైన కథలకు ప్రాధాన్యతను ఇస్తోంది.

బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అంతేకాకుండా పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు.

సినిమాలలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది.తెలుగులో ఆమె( Aame ) పేరుతో సినిమా విడుదలైన విషయం తెలిసిందే.అందులో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.

Advertisement

ప్రస్తుతం అమలాపాల్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్( Prithviraj sukumaran ) నటిస్తున్న ఆడుజీవితం అనే చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమాకు బ్లేస్సి దర్శకత్వం వహించారు.ఇదే సినిమాని ది గోట్ లైఫ్ అనే పేరుతో ఇంగ్లీషులో కూడా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా కోసం చిత్ర బృందం ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా గత పదేళ్లుగా శ్రమిస్తోంది.ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో పృథ్వీరాజ్, అమలాపాల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉంది.దీనితో అమలాపాల్ బోల్డ్ సన్నివేశాల జోరు ఇప్పట్లో ఆగేలా లేదు అంటూ కామెంట్స్ వినిపించాయి.తాజాగా అమలాపాల్ ఈ లిప్ లాక్ సన్నివేశంపై స్పందించింది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాకు నేను సైన్ చేసే ముందు దర్శకుడు ఇటువంటిది ఒకటి ఉంటుందని ముందే చెప్పారు.అప్పుడు నేను ముందే ఆ సీన్ కి ఓకే చెప్పేసాను.

Advertisement

ఆ సన్నివేశం పండాలంటే తప్పనిసరిగా లిప్ లాక్ ఉండాలి అందుకే చేశాను అని చెప్పుకొచ్చింది అమలాపాల్.

అంతేకాదు కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా నేను సిద్దమే.ఈ విషయం నేను ఇదివరకే చెప్పాను.న్యూడ్ గా నటించేందుకే రెడీ అయిన నాకు లిప్ లాక్ సన్నివేశం అంత ఇబ్బందిగా అనిపించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అమలాపాల్.

ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు.సినిమాలో పాత్రల కోసం మళ్లీ అంతగా దిగజారిపోయి న్యూడ్ గా నటించడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు