Rajanna Sircilla : పారుకం కాలువల తో పాటు మోటార్లు కూడా నడిపించుకోవాలి : ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట,నారాయణపూర్, కోరుట్లపేట,సర్వాయిపల్లె గ్రామాల ఆయకట్టు కు సాగు నీటిని అందించే సింగ సముద్రం లో ప్రస్తుతం 16ఫీట్ల నీరు మాత్రమే ఉందని కాబట్టి రైతులు పారుకం కాలువల( Parukam Kaluva ) నీటిని పంట కాలువలకు పెట్టుకుంటు మీమీ బోర్ మోటార్ లను సైతం నడిపించుకోవాలని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ రైతులను కోరారు.

ప్రస్తుతం వరి పంట పొలాలు పొట్ట దశలో ఉన్నాయని రైతులు పారుకాం కాలువలు,బోర్ మోటార్ లు నడిపించుకుంటే పొలాలు సమృద్దిగా పండుతాయని బాలరాజు యాదవ్ అన్నారు.

ప్రస్తుతం ఎల్లారెడ్డి పేటలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు బాలరాజు యాదవ్( Balaraju Yadav ) దృష్టికి తీసుకు రాగ సముద్రం నీరటి లతో కలిసి వెళ్ళి ఆయన పరిశీలించారు.ఎగువ మానేర్ నుండి సింగ సముద్రంలోకి ఒక ఆరు ఫీట్ల నీటిని విడుదల చేయాలని ఎగువ మానేర్ డి ఈ నీ కోరినట్లు ఆయన తెలిపారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట సింగ సముద్రం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు నేవూరీ బాలయ్య గారి గోపాల్ రెడ్డి, రాగుల తిరుపతి రెడ్డి సముద్రం నీరటిలు మ్యాకల శరవింద్, ఎనగందుల సత్యనారాయణ, ఎనగందుల దేవయ్య లు ఉన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News