మోకాళ్ళ నొప్పుల‌ను నివారించే కలబంద..ఎలాగంటే?

వ‌య‌సు పెరిగే కొద్ది మోకాళ్ళ నొప్పులు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో యువ‌తీ, యువ‌కుల్లోనూ ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది.

శ‌రీరంలో పోషకాల కొర‌త‌, జీవ‌న శైలిలో మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, కీళ్లలో అరుగుదల, అధిక బరువు, సరైన శారీరక శ్రమ లేక పోవడం, ఏవైనా దెబ్బ‌లు త‌గ‌ల‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మోకాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి.అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.

కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా మోకాళ్ళ నొప్పిల‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు ఈ చిట్కాలు ఏంటో చూసేయండి.

క‌ల‌బంద‌.దీని రుచి చేదుగా ఉన్నా ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

Advertisement
Aloe Vera Helps To Get Rid Of Knee Pain Naturally! Knee Pain, Aloe Vera, Benefit

అలాగే మోకాళ్ళ నొప్పుల‌ను నివారించే స‌త్తా కూడా క‌ల‌బందకి ఉంది.మ‌రి ఇంత‌కీ దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే.

చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల‌ న్యాచుర‌ల్‌ క‌ల‌బంద జెల్‌ను వేసి లైట్‌గా హీట్ చేయాలి.ఇప్పుడు ఇందులో చిటికెడు మిరియాల పొడి, అర స్పూన్ ప‌టిక బెల్లం క‌లిపి తినాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే కేవ‌లం కొద్ది రోజుల్లోనే మోకాళ్ళ నొప్పి ప‌రార్ అవుతుంది.

Aloe Vera Helps To Get Rid Of Knee Pain Naturally Knee Pain, Aloe Vera, Benefit

ఎండు ద్రాక్షలు కూడా మోకాళ్ళ నొప్పుల‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్ష‌ల‌ను తింటే.అందులో ఉండే సల్ఫైడ్ కీళ్ల‌ను దృఢ ప‌రిచి నొప్పిని త‌గ్గిస్తుంది.

Aloe Vera Helps To Get Rid Of Knee Pain Naturally Knee Pain, Aloe Vera, Benefit
దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

అలాగే ఆవాల‌తోనూ మోకాళ్ళ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.అందు కోసం కొన్ని ఆవాల‌ను తీసుకుని మెత్త‌టి పిండిలా చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆవ పిండిలో కొద్దిగా వాట‌ర్ లేదా కొబ్బ‌రి నూనెను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మోకాళ్ళ‌పై అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు