ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా పుష్ప.
ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది.ఎన్నో రోజుల నుండి ఈ సినిమా కోసం బన్నీ అభిమానులే కాదు.
యావత్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పెషల్ సాంగ్ తో మెరిపించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గత కొన్ని రోజులుగా పుష్ప టీమ్ మొత్తం ఇంటర్వ్యూలలో బిజీగా ఉంది.
.వరుస ప్రమోషన్స్ చేస్తూ జనాలకు మరింత దగ్గర చేసారు.
ఈ రోజు విడుదలైన సందర్భంగా ఇప్పటికే అభిమానులు భారీ స్థాయిలో టికెట్స్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమాపై గత రెండు రోజులుగా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మరీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000 పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయ్యింది.ఈ ప్రాంతాలన్నీటిలో ఇప్పటికే 95 శాతం టికెట్స్ అమ్ముడు పోయాయని సమాచారం.ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను ఫ్యామిలీ తో కలిసి థియేటర్ లో చూసేందుకు రెడీ అయ్యాడు.

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ రోజు పుష్పరాజ్ ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ లో వీక్షించ బోతున్నారు.ఈ సమాచారాన్ని ఆయన సోషల్ మీడియా మేనేజర్ శరత్ చంద్ర తెలిపారు.విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునేందుకు రెడీ అయ్యారు.మరి అభిమానులతో కలిసి పుష్పరాజ్ థియేటర్ లో సినిమా చూస్తున్నాడు అని తెలుసుకున్న ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి మన దగ్గర పుష్ప మ్యానియా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.