బన్నీ పక్కన హీరోయిన్ గా కేతిక శర్మ  

Allu Arjun Romance Next With Ketika Sharma-allu Arjun Next Movie,ketika Sharma,ketika Sharma Telugu Movie,trivikram Srinivas Next Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర హీరో బన్నీ హాలిడే ట్రిప్ లో ఉండడం తో ఈ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ పడింది. దీనితో హాలిడే నుంచి బన్నీతిరిగి రాగానే ఈ చిత్ర రెండో షెడ్యూల్ మొదలవుతుంది..

బన్నీ పక్కన హీరోయిన్ గా కేతిక శర్మ-Allu Arjun Romance Next With Ketika Sharma

ఈ చిత్రంలో బన్నీ పక్కన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వారిలో ఒకరు పూజా హెగ్డే కాగా మరొక హీరోయిన్ ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు.

అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కేతిక శర్మ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేతిక పూరి కుమారుడు ఆకాష్ తో ‘రొమాంటిక్’ సినిమా లో కధానాయిక గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఆమె రోల్ ఏంటి అన్న దానిపై ఇంకా ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆమె సెకండ్ హీరోయిన్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

హారికా హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే..