టీజర్‌ రివ్యూః తగ్గేదేలే.. అంటూ వచ్చేసిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా నుండి పుష్పరాజ్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు పరిచయం చేశారు.

రేపు అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల అయిన పుష్ప టీజర్‌ తో పుష్ప రాజ్‌ పాత్ర ఏంటీ ఎలా ఉండబోతున్నాడు.

సినిమాలో రష్మిక పాత్ర ఏంటీ అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.ఈ టీజర్‌ లో బన్నీ లుక్‌ ను చూస్తుంటే మరీ మాస్ గా ఉన్నాడు అంటున్నారు.

ఇన్నాళ్లు స్టైలిష్‌ స్టార్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన అల్లు అర్జున్‌ అభిమానులు ఇప్పుడు ఐకానిక్‌ స్టార్‌ అంటూ పుష్ప సినిమా తర్వాత మార్చేశారు.పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కథాంశంను తీసుకున్న విషయం తెల్సిందే.

ఈ టీజర్‌ లో అదే విషయాన్ని మరింత క్లారిటీగా చూపించారు.ట్రైలర్‌ లో చూపించిన దాన్ని బట్టి చూస్తుంటే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ లారీ డ్రైవర్‌ గా పుష్ప రాజ్‌ కనిపించబోతున్నాడు.

Advertisement

పోలీసులతో అల్లు అర్జున్‌ పోరాట సన్నివేశాలు మరియు అటవిలో మొత్తం ఎర్ర చందనం చుట్టు తిరిగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు.బన్నీ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్‌ ఈ టీజర్‌ లో చాలా ఆకర్షణీయంగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ కెరీర్‌ బెస్ట్‌ సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.రష్మిక లుక్‌ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది.

రంగస్థలం సినిమాలో సమంత ఏ రేంజ్ లో అయితే ఆకట్టుకుందో ఇప్పుడు పుష్ప సినిమాలో రష్మిక అలాగే కనిపిస్తుందంటున్నారు.మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెంచేలా ఈ టీజర్‌ ఉంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా లో మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో రూపొందించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఆగస్టులో ఈ సినిమా రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు