అల్లు అర్హతో కలిసి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్( Allu Arjun ) కూతురు అల్లు అర్హ( Allu Arha ) తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా( Sakunthalam movie )లో కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్హ సందడి చేయబోతోంది.

అల్లు వారి పాప పోషించిన పాత్ర చిన్నదే అయినా కూడా ఆమె కి ఉన్న క్రేజ్ అంతా కాదు.అందుకే ఆమె ను ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగం చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా చిత్ర సమర్పకుడు అయిన దిల్‌ రాజు( Dil raju ) భావించారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హ తో కలిసి శాకుంతలం సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు.

Allu Arjun Going To Attend To Shakuntalam Movie Pre Release Event With Allu Arha

దర్శకుడు గుణశేఖర్( Gunasekhar ) తో అల్లు అర్జున్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఎనిమిది సంవత్సరాల క్రితం గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన శాకుంతలం సినిమా లో గోన గన్నారెడ్డి పాత్ర ను పోషించిన అల్లు అర్జున్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ పాత్ర ఎన్నో సినిమాల్లో పాత్రలకు ఆధ్యం పోసినట్లు అయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Allu Arjun Going To Attend To Shakuntalam Movie Pre Release Event With Allu Arha
Advertisement
Allu Arjun Going To Attend To Shakuntalam Movie Pre Release Event With Allu Arha

ఇక అల్లు అర్హ ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న నేపథ్యం లో ఆమె ను పరిచయం చేసేందుకు గాను అల్లు అర్జున్ శాకుంతలం సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.సమంత తో పాటు అల్లు అర్జున్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.అతి త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకు కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.

ఈ సినిమా లో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు