అనీల్‌ రావిపూడిని రంగంలోకి దించిన అల్లు అరవింద్

పూర్తి తెలుగు కంటెంట్‌తో ఉన్న ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా.

పూర్తిగా తెలుగు ఉన్నందువల్ల దీనికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని అల్లు వారు భావించారు.

కాని కొద్ది మొత్తంతో ఎక్కువ కంటెంట్‌ ఉన్నప్పుడు ఎందుకు తక్కువ కంటెంట్‌కు ఎక్కువ డబ్బులు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆహాను పెద్దగా ఆధరించడం లేదు.వెబ్‌ సిరీస్‌లు ఎక్కువ లేకపోవడంతో పాటు పెద్ద సినిమాలను కూడా అల్లు వారు కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ చేయడం లేదు.

ఆహాకు దెబ్బ పడటం ఖాయం అనుకుంటున్న సమయంలో అల్లు అరవింద్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ను భారీ ఎత్తున క్రియేట్‌ చేయించే ప్రయత్నాలు చేస్తున్నాడు.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ముగ్గురు ప్రముఖ దర్శకులతో అల్లు అరవింద్‌ ఆహా కోసం వెబ్‌ సిరీస్‌లు తయారు చేయిస్తున్నాడట.

అందులో ఇప్పటికే ఒకటి షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది.తాజాగా అనీల్‌ రావిపూడితో కూడా అల్లు అరవింద్‌ వెబ్‌ సిరీస్‌కు ఒప్పందం చేసుకున్నాడట.అనీల్‌ రావిపూడిని రంగంలోకి దించిన అల్లు

Advertisement

అనీల్‌ రావిపూడి తదుపరి చిత్రం ఎఫ్‌ 3 కి సమయం పట్టే అవకాశం ఉంది.అందుకే ఆ గ్యాప్‌ లో అల్లు అరవింద్‌ అడిగిన మేరకు ఒక వెబ్‌ సిరీస్‌ను పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో అనీల్‌ రావిపూడి తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు.దాదాపు కొటిన్నర బడ్జెట్‌తో రూపొందబోతున్న ఆ వెబ్‌ సిరీస్‌ను ప్రముఖ నటీనటులతో తెరకెక్కించబోతున్నారు.

కేవలం 20 నుండి 25 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారట.ఈ వెబ్‌ సిరీస్‌తో ఆహా మారు మ్రోగిపోతుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు