గీతా ఆర్ట్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కోసం రెడీ.. వరుసగా అరడజను భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్!

ప్రస్తుతం మన టాలీవుడ్( Tollywood ) చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.కానీ వాటిల్లో టాప్ లో కొన్ని మాత్రమే ఉన్నాయి.

ఎందుకంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువ ప్రాజెక్టులు చేస్తూ ముందంజలో ఉంటే వారే టాప్ లో ఉన్నట్టు.మరి ప్రస్తుతం ప్రతీ నిర్మాణ సంస్థ స్పీడ్ పెంచడానికి ట్రై చేస్తుంది.

ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం ఒక్కో సంస్థ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ ప్రకటించుకుంటూ వెళ్తుంది.మైత్రి మూవ్ మేకర్స్, దిల్ రాజు, పీపుల్స్ మీడియా, సితార ఇలా కొన్ని సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాయి.

కానీ ఎప్పటి నుండో తెలుగులో సినిమాలు చేస్తున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ మాత్రం కాస్త వెనకబడినట్టు కనిపిస్తుంది.

Allu Aravind Announces An Exciting Lineup Of Geetha Arts, Allu Aravind, Geetha A
Advertisement
Allu Aravind Announces An Exciting Lineup Of Geetha Arts, Allu Aravind, Geetha A

దీంతో అల్లు అరవింద్ ( Allu Arvind )కూడా రంగంలోని దిగి తమ బ్యానర్ వాల్యూను నిలబెట్టేలా సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.గత కొంత కాలంగా చిన్న సినిమాలనే నిర్మిస్తూ వస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలను ఎంచుకునే పనిలో పడింది.ముచ్చటగా మూడు సినిమాలను ప్రకటించే అవకాశం ఉందట.

Allu Aravind Announces An Exciting Lineup Of Geetha Arts, Allu Aravind, Geetha A

అందులో ఒకటి సూర్య - బోయపాటి ( Surya - Boyapati )కాంబో మూవీ కాగా.చందు మొండేటి - నాగ చైతన్య మూవీ ఉండబోతుందట.ఆ తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ఉంటుందట.

ఇలా ముచ్చటగా మూడు భారీ సినిమాల ప్రకటనలు అయితే రానున్నాయని సమాచారం.ఇవి కాక మరో మూడు ప్రాజెక్టులు డిస్కషన్ లో ఉన్నాయని ఇవన్నీ ఒకేసారి వచ్చే నెల అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు