అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) బిజిబిజీగా గడుపుతున్న సంగతతి తెలిసిందే.ఇప్పటికే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేసిన ఆయన.
వైట్‌హౌస్‌లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు.ఇక మోడీ అమెరికా పర్యటనలోనే అత్యంత కీలక ఘట్టం యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించడం.
అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు.
ప్రపంచంలోని అన్ని దేశాల వాసులను అక్కును చేర్చుకుని వారికి అమెరికా సముచిత స్థానం కల్పిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు.
ఇక్కడ లక్షలాది భారత మూలాలున్న వారు వున్నారని.వీరిలో కొందరు ఈ సభలో కూర్చొన్నారని మోడీ ప్రసంగించి అందిరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పలుమార్లు కాంగ్రెస్ సభ్యులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి ఆయనను గౌరవించారు.రాజకీయ నాయకులుగా అభిప్రాయభేదాలు వుండొచ్చు కానీ.
దేశానికి సంబంధించినంత వరకు మాత్రం ఒకే స్వరంగా వుండాలని ప్రధాని మోడీ సూచించారు.

ఇదే సమావేశంలో ‘‘ సమోసా కాకస్’’( Samosa Caucus ) అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.యూఎస్ కాంగ్రెస్ ఎంతో రుచికరమైనదిగా మారిందని, రాను రాను ఈ టేస్ట్ ఎంతో పెరుగుతుందని వ్యాఖ్యానించారు.ఈ సమోసా కాకస్ భవిష్యత్తులో అన్ని రకాల భారతీయ వంటకాలను , వాటి రుచులను ఇక్కడికి తీసుకొస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.
దీంతో అసలు సమోసా కాకస్ అంటే ఏమిటీ.? అమెరికన్ రాజకీయాల్లో దాని పాత్ర ఏంటనే దానిపై నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.

2018లో భారత సంతతికి చెందిన ఐదుగురు ఎంపీలు అమెరికా పార్లమెంట్‌కు ఎన్నికైన సమయంలో యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamoorthi ) తన ప్రసంగంలో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు.నాటి నుంచి అమెరికా పార్లమెంట్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్‌ను సమోసా కాకస్‌గా వ్యహరిస్తున్నారు.ప్రస్తుతం ఇందులో ఐదుగురు ఎంపీలు వున్నారు.భారతీయ వంటకమైన సమోసాకు ప్రపంచవ్యాప్తంగా వున్న ఆదరణ కారణంగా.ఈ గ్రూప్‌కు విశేషమైన ఆదరణ దక్కింది.








