ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల ( Sirisilla )పట్టణ పోలీస్ స్టేషన్ నుండి గీత నగర్, విద్యానగర్, అంబేద్కర్ నగర్ ,శాంతి నగర్,రాళ్లబావి, పెద్దబజార్, కొత్తబస్టాండ్ వరకు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ నందు పోలీస్ అధికారులతో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ.

ఈ నెల 30వ తేదీన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల( Police ) ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మద్యం,నగదు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమాలు ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల వేళ సోషల్ మీడియా( Social media ) వేదికగా వర్గాల మధ్య ,వ్యక్తుల మధ్య అల్లర్లు సృష్టించే వారిపై,సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్ట్ లు పెట్టేవారిపై ప్రత్యేక నజర్ పెట్టాలని,అలా జరిగినట్లు అయితే పోస్ట్ చేసే వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ లపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలన్నారు.

Advertisement

ఈ ఫ్లాగ్ మార్చ్ లో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ లు,బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News