ప‌వ‌న్ కళ్యాణ్ కి బెంగేం లేదంట‌!!

రాయుడికి ఫియ‌ర్ లేదు.స‌మ్మ‌ర్ అయినా వింట‌ర్ అయినా ఒక్క‌టే.

ఎక్క‌డైనా ఎప్పుడైనా ఒంటరి పోరే!ఇక బ్యాలెట్ బేటిల్ గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేముంది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ తాజాగా ట్విటారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించాడు.ఇప్ప‌టికే జ‌న‌సేన ని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేస్తున్న ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

మ‌రోవైపు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా 2018 ఆఖ‌రులో ఎన్నిక‌లుంటాయ‌ని సంకేతాలు ఇచ్చిన నేప‌థ్యం జ‌న‌సేనాని కూడా స‌మ‌రానికి సై అంటున్నారు.అర్హుల‌కే ఛాన్స్ జ‌న‌సేన పూర్తి స్థాయిలో ఆవిర్భావించిన త‌రువాత రానున్న ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రి దృష్టి ప‌వ‌న్ వైపే ఉంది.

Advertisement

కానీ ప‌వ‌న్ మాత్రం ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకునేందుకు ప్రాథాన్యం ఇస్తున్నారు.గ‌తంలో ప‌లుమార్లు టీడీపీ, వైఎస్సార్ సీపీ , కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న‌ను క‌లిసిన‌ప్ప‌టికీ ఆయ‌న వారికి టిక్కెట్లు కేటాయించే విష‌యంలో ఎటువంటి హామీ ఇవ్వ‌లేద‌ని సమాచారం.

రాజ‌కీయంలో వార‌స‌త్వం అంటే త‌న‌కు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ద‌ని త‌రుచూ చెబుతున్నందున ప్ర‌జాక్షేత్రంలో క్రియాశీల‌కంగా ఉంటూ, కాస్తో కూస్తో గుర్తింపు పొందిన సామాజిక కార్య‌క‌ర్త‌ల‌కు ఈ సారి ఆయ‌న అవ‌కాశం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.పార్టీ కార్యాల‌య వ‌ర్గాలు కూడా అర్హులైన అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఇప్ప‌టి నుంచే పేప‌ర్ వ‌ర్క్ చేస్తుంది.

జిల్లాల వారీగా స‌మ‌స్య‌ల‌పై రిపోర్ట్స్ చెప్పించుకుని, వాటి ప‌రిష్కారానికి ఏం చేయాలో అన్న‌ది వివిధ రంగాల‌కు చెందిన విష‌య నిపుణులు (స‌బ్జెక్ట్ ఎక్స్‌పెర్ట్స్‌)తో చ‌ర్చిస్తోంది.ఇప్ప‌టికే శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానం స‌మ‌స్య మొద‌లుకొని, అనంత‌పురం క‌రువు ర‌క్క‌సి దాకా అనేకానేక స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని మాట్లాడుతూ వ‌స్తున్నారు.

ట్విట‌ర్ మాధ్య‌మం ద్వారా స్పందిస్తున్నారు.నిపుణులైన వ‌క్త‌లు, ర‌చ‌యిత‌లు కోసం అనంత వేదిక గా టాలెంట్ హంట్‌ని కూడా మొద‌లుపెట్టినందున జ‌న‌సేన వ‌ర్త‌మాన రాజ‌కీయ చ‌రిత్ర‌లో వినూత్న పంథాకు శ్రీ‌కారం దిద్దిన‌ట్టే! ఇక రేప‌టి వేళ పోటీ చేసినా సీట్లు ఓట్లు అన్న‌వి కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే త‌న ధ్యేయ‌మ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసినందున రానున్న ఎన్నిక‌ల్లో జ‌నసేన ఏ మేర‌కు ప్ర‌భావం చూప‌నుంద‌న్న‌ది తెల్సుకోవాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే!! ప్ర‌భుత్వం ఏర్పాటులో ప‌వ‌న్ డెసిష‌న్ ఏ విధంగా ఉంటుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ? 

లేకా ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇస్తారా అన్న‌ది కూడా రేప‌టి వేళ తేలాల్సిన మ‌రో విష‌యం.

Advertisement

తాజా వార్తలు