లాక్‌డౌన్ తరువాత చాలా కష్టం అంటోన్న బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సాధించింది.

ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపుతో పాటు పలు అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి.

కాగా ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే ఈమె ఇప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొనలేదు.కాగా లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ జాయిన్ కానుంది.

కాగా ఇప్పుడు లాక్‌డౌన్ తరువాత ఆమెకు చాలా పెద్ద సమస్య వచ్చి పడిందని తెలుస్తోంది.ఆమె చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయట.వాటి షూటింగ్‌లు కూడా ఆర్ఆర్ఆర్ తరువాత మొదలుపెట్టాల్సి ఉంది.

Advertisement

మరి లాక్‌డౌన్ ముగియగానే ఆర్ఆర్ఆర్ కోసం డేట్లు అడ్జెస్ట్ చేస్తున్న ఆలియా, మిగతా చిత్రాల కోసం ఎలా డేట్లు అడ్జెస్ట్ చేస్తుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు