సమంత యాటిట్యూడ్ కు ఫిదా అయిన హీరో.. తదుపరి సినిమాలో అవకాశం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ సినిమాలు కూడా చేస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే ఆగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

ఇలా దక్షిణాసిని ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది.

ఇకపోతే తాజాగా పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా ఈమె మరింత క్రేజ్ దక్కించుకుందని చెప్పాలి.సమంత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సమంత కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా తన మాట తీరుతో చమత్కారం చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈమె మాట తీరు ఈమె ఆటిట్యూడ్ నచ్చిన అక్షయ్ కుమార్ తనకు తన తదుపరి సినిమాలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రంలో సమంత నటించబోతున్నారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.ఇదే కనుక నిజమైతే సమంత సినీ కెరియర్ లో మరో మెట్టు పైకి ఎక్కినట్లేనని పలువురు భావిస్తున్నారు.ఇప్పటికే ఇది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ లో ఉన్న సమంతకు ఇప్పటికే పలు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయని సమాచారం.

Advertisement

ఇక ఈమె తెలుగులో నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యశోద ఖుషి సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు