వెబ్ సిరీస్ కోసం ఏకంగా 90 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరో

వెబ్ సిరీస్ లకి ప్రస్తుతం డిమాండ్ ఫుల్ గా ఉంది.

ఈ నేపధ్యంలో డిజిటల్ ఛానల్స్ అన్ని కూడా వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టాయి.

కొత్త దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు అందరూ వెబ్ సిరీస్ కథలతో ఓటీటీ ఛానల్స్ లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.సినిమా అయితే దర్శకులకి ఫేమ్ ఉంటుంది.

వెబ్ సిరీస్ లకి దర్శకుడు ఎవరనే విషయం కూడా ఆడియన్స్ పెట్టుకోరు.బాగుంటే చూస్తారు.

కేవలం వెబ్ సిరీస్ ఏ ఛానల్ లో వస్తుంది అనే విషయం మాత్రమే పట్టించుకుంటారు.అయితే ఓటీటీ సంస్థలు పెద్ద దర్శకులు, పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ తో కొన్ని వెబ్ సిరీస్ లని తెరకెక్కిస్తున్నాయి.

Advertisement

ఈ నేపధ్యంలో హీరోలని రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో, వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ కూడా ది ఎండ్ అనే వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఎప్పుడో ఆరు నెలల క్రితమే అనుకున్న కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ఈ సిరీస్‌లో అక్షయ్ అద్భుతమైన స్టంట్స్ చేయనున్నాడు.ఈ సిరీస్ లో అక్షయ్ కుమార్ కొడుకు కూడా నటుడుగా తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కోసం అక్షయ్ కుమార్ అన్ని ఎపిసోడ్స్ కి కలిపి ఏకంగా 90 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇంత పెద్ద మొత్తంలో వెబ్ సిరీస్ ద్వారా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మొట్టమొదటి ఇండియన్ హీరో అక్షయ్ కుమార్ అని చెప్పుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
ఈ అవతారం ఏంటి సామ్.. ఆమె లేటెస్ట్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ వింటే షాకవ్వాల్సిందే!

అతనికి ప్రస్తుతం ఉన్న ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి సదరు ఓటీటీ సంస్థ ముందుకొచ్చిందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు