కరోనాతో మరో కొత్త సమస్య.. ఈసారి పిల్లల్లో?

2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో కరోనా వైరస్ విజృంభించింది.

వుహాన్ నగరంలో వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

అయితే నగరాన్ని షట్ డౌన్ చేయడం, వేగంగా చికిత్స అందించడం ద్వారా వైరస్ ను కట్టడి చేయడంలో డ్రాగన్ కంట్రీ సక్సెస్ అయింది.అయితే ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది.

సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా వల్ల వ్యాధి వచ్చినా ఒకే తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.కరోనా సోకితే మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఈ మహమ్మారికి సంబంధించి మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది.ఎయిమ్స్ వైద్యులు కరోనా సోకిన ఒక చిన్నారిలో బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు గుర్తించారు.

Advertisement

ఒక చిన్నారిలో మెదడులోని నాడులు పూర్తిగా దెబ్బతినడంతో కంటి సంబంధిత సమస్యలు వచ్చినట్టు గుర్తించారు.కరోనా సోకిన 11 సంవత్సరాల చిన్నారి ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ బారిన పడిందని.

ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పారు.సాధారణంగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడరని కానీ కరోనా వల్ల మెదడులోని మైలిన్ పొర దెబ్బ తినడంతో పాపకు కరోనా సోకినట్టు తెలిపారు.

అయితే చిన్నారికి సకాలంలో చికిత్స అందించడం వల్ల ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగైందని వైద్యులు వెల్లడించారు.ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ కంటి సమస్యలతో పాటు కండరాల సమస్యలకు, మూత్రాశయ సంబంధిత సమస్యలకు కారణమవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పెద్దలతో పోలిస్తే పిల్లలపై తక్కువగా ఉంది.అయితే పిల్లల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండటం కరోనా సోకిన చిన్నారుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు