కొత్తగా ఇలియానా "నడుము" వివాదం

పాటల్లో హీరోయిన్ ని గ్లామరస్ గా చూపించడం కోసం "నడుము" అనే శరీరభాగాన్ని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించుకుంటున్నారు తెలుగు దర్శకులు.

అయితే ఈ ట్రెండ్ ని మొదలుపెట్టి, దాని పాపులర్ చేసిన దర్శకుడు ఎవరు అంటే అందరు ముక్తకంఠంతో రాఘవేంద్రరావు అని చెబుతారు.

అందులో సందేహం కూడా అక్కరలేదు.ఎందుకంటే ఆయన నడుము చూపించడంతో ఆగకుండా, హీరోయిన్ నడుముని పండ్లతో, పూలతో కొట్టడం మొదలుపెట్టారు.

మొన్న వచ్చిన ఓం నమో వేంకటేశాయలో కూడా నడుము, నాభిని వదిలిపెట్టలేదు దర్శకేంద్రుడు.ఈ స్టయిల్ మీద తాప్సి చేసిన కామెంట్స్ ఎంత వివాదస్పదమయ్యాయో మీరంతా చూసారు.

ఇప్పుడు ఇంచుమించు అలాంటి కామెంట్స్ చేసింది "నడుము" సుందరి ఇలియానా.ఇలియానా ఒకప్పుడు అంత స్టార్ డమ్ ఎంజాయ్ చేసింది అంటే అందుకు కారణం ఆమె నడుము.

Advertisement

అవును, దర్శకులంతా పోటిపడి మరి ఇలియానా నడుము మీద ఫోకస్ చేసారు.ఆ పిచ్చికి పరాకాష్ట ఏమిటంటే, తమిళ సినిమా నన్బన్ లో (తెలుగులో స్నేహితుడు) ఆమె నడుముపై ఓ పాట రాసేసారు.

అంత ఫేమస్ అయిన ఇలియానా నడుముని అలా ఫేమస్ చేసింది ఎవరు అంటే దర్శకుడు వైవిఎస్ చౌదరి.దేవదాసులో ఇలియానా నడుముపై ఏకంగా శంఖం వేసాడు ఈ దర్శకుడు.

ఇప్పుడు ఇలియానా చౌదరి పేరు పైకి చెబుతూ కామెంట్ చేయలేదు కాని, అలా నాతొ ఎందుకు చేయించారో అర్థం కాలేదు, నడుము శంఖంతో కొడితే చాలా నొప్పి వేసింది.అందులో ఏం శృంగారం ఉందొ అర్థం కాదు.

ఇలా హీరోయిన్ల నడుముపై పళ్ళు, పూలు, శంఖాలు కొట్టడం చాలా దారుణమైన విషయం అంటూ కామెంట్ చేసింది ఇల్లి బేబి.అంటే ఇక్కడ ఇలియానా నడుము చూపించడాన్ని తప్పుబట్టలేదు, నడుముని అలా రకరకాల పళ్ళతో, వస్తువులతో కొట్టడాన్ని తప్పుపట్టింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తాప్సి కామెంట్స్ కి కొనసాగింపులా ఉన్న ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతాయో లేదో మరి.

Advertisement

తాజా వార్తలు