క్రియేటివ్‌ డైరెక్టర్ గాడిలో పడ్డట్లేనా? ఆగిపోయిన ఆ సినిమాలు మళ్లీ మొదలయ్యేనా?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ( krishna vamshi ) దర్శకత్వం లో నటించాలని ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు క్యూ కట్టేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

ఆయన దశాబ్ద కాలంగా ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సొంతం చేసుకోలేక పోయాడు.దాంతో కృష్ణవంశీ అడిగితే కొందరు కాదంటున్నారు.

కొందరు కనిపించకుండా మొహం చాటేస్తున్నారు.ప్రతి హీరో కూడా గతం లో కృష్ణవంశీ తో వర్క్ చేయాలని భావించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ అడుగుతారో అని దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన నుండి రంగమార్తాండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరాఠీ సూపర్ హిట్ చిత్రం నట సామ్రాట్ కి ఈ సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే.

Advertisement

ఒరిజినల్ వర్షన్‌ ని మరిచి పోయేలా అద్భుతమైన సినిమా ను రంగమార్తాండ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు అంటూ కృష్ణవంశీ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ సమయంలో ఆయన ఒక గొప్ప దర్శకుడు అని మరోసారి నిరూపితం అయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయంలో కృష్ణవంశీ నూటికి నూరు మార్కులు దక్కించుకున్నాడు.కానీ రంగమార్తాండ చిత్రం( Rangamarthanda film ) కమర్షియల్ సినిమా కాకపోవడం.

కమర్షియల్ గా సక్సెస్ అవ్వక పోవడం తో దర్శకుడు కృష్ణవంశీ కెరియర్ ఎంత వరకు గాడిలో పడ్డట్లు అనే చర్చ మొదలైంది.ఇలాంటి విభిన్నమైన ఆర్ట్ సినిమాలను తీస్తే జనాలు చూస్తారా లేదా అనేది అనుమానమే.

అలాగే స్టార్ హీరోలు ముఖ్యంగా కమర్షియల్ హీరోలు ఈ దర్శకుడిని పట్టించుకుంటారా అంటే డౌటే అంటూ టాక్ వినిపిస్తుంది.రంగమార్తాండ సినిమా తర్వాత అయినా గతం లో కృష్ణవంశీ మొదలు పెట్టి ఆపేసిన సినిమాలు మళ్లీ మొదలవుతాయా అనేది చూడాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ముఖ్యంగా ఆయన మొదలు పెట్టాలనుకున్న బాలకృష్ణ( Balakrishna ) రైతు చిత్రం ఎంత వరకు మళ్లీ చర్చల దశకి వస్తుంది.షూటింగ్ ప్రారంభమవుతుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు