ఉస్తాద్‌ మేకర్‌... రవితేజ, బాలకృష్ణ అసలు ఏం జరుగుతోంది?

విభిన్న చిత్రాల దర్శకుడిగా కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న హరీష్ శంకర్( Harish Shankar ) ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) అనే సినిమా ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తి అయింది.

ఈ సంవత్సరం చివరి వరకు సినిమా ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఒక వైపు పవన్ కళ్యాణ్ సినిమా ను చేస్తూనే మరో వైపు దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా కు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే మాస్ మహారాజా రవితేజ( Raviteja ) హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోపోతుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో మిరపకాయ్‌ చిత్రం వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు కొత్తగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.రవితేజ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే బాలకృష్ణ సినిమాని( Balakrishna ) కూడా దర్శకుడు హరీష్ శంకర్ లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

Advertisement

మొత్తానికి మూడు సినిమాలను కూడా దర్శకుడు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నాడు.

వచ్చే సంవత్సరంలో ఏకంగా రెండు సినిమాలను దర్శకుడు విడుదల చేసే విధంగా ముందస్తు ప్రణాళికలు చేసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి.బాలకృష్ణ తో చేయబోతున్న సినిమా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి ఈ ముగ్గురు స్టార్స్ తో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా లు రాబోతున్నాయి.

హరీష్ శంకర్ కాంబోలో పవన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.అలాగే ఆయన తదుపరి సినిమా ల కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు