ఆరెంజ్ పండు తిన్న తర్వాత.. ఈ పదార్ధాలు తినడం అస్సలు మంచిది కాదు..

చలికాలంలో అధికంగా దొరికే పండు ఏదైనా ఉందంటే అది ఆరెంజ్ పండు.ఈ పండ్లు చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి.

అదేవిధంగా చలికాలంలో తక్కువ ధరకే ఈ పండు లభిస్తుంది.ఆరెంజ్ పండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అదేవిధంగా ఆరెంజ్ పండు అంటే పోషకాల పవర్ హౌస్ అని చెప్పవచ్చు.ఇందులో విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్ లాంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

అందుకే దీన్ని తినడం వల్ల ఎన్నో రోగాలు దూరం అవుతాయి.కానీ ఆరెంజ్ పండును తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

లేకపోతే అది ఆరోగ్యానికి హానిచేస్తుంది.ఆరెంజ్ పండు తిన్న వెంటనే కొన్ని పదార్థాలు తినకూడదు.

ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.ఆరెంజ్ పండు తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు.

అలా తాగితే జీర్ణక్రియ పై చెడు ప్రభావం పడుతుంది.అలాగే అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

అదేవిధంగా చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయి.చాలామంది తిన్నాక జ్యూస్ తాగుతారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

అదే విధంగా జ్యూస్ తాగిన తర్వాత పాన్ తింటారు.

Advertisement

ఇలా తింటే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది.అది ఇబ్బందికి గురి చేస్తుంది.అదేవిధంగా ఆరెంజ్ పండ్లు తిన్న తర్వాత మరో పండు కూడా తినకూడదు.

నారింజ పండు తిన్న తర్వాత బొప్పాయి పండు అస్సలు తినకూడదు.ఈ రెండు పండ్లు ఎప్పుడు కూడా కలిపి తినడం మంచిది కాదు.

ఎందుకంటే ఇలా ఈ రెండు పండ్లు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

అలాగే చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.ఇక అంతే కాకుండా ఆరెంజ్ పండు తిన్న తర్వాత పెరుగు కూడా అస్సలు తినకూడదు.అదేవిధంగా మజ్జిగ కూడా తాగకూడదు.

అందుకే ఆరెంజ్ పండ్లు తిన్న ప్రతిసారి కూడా కాస్త సమయాన్ని కేటాయించి ఆ తర్వాత వేరే పదార్థాన్ని తీసుకోవడం మంచిది.లేకపోతే ఇది మన ఆరోగ్యం పై హాని కలిగిస్తుంది.

తాజా వార్తలు