వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎన్ని రికార్డులు సృష్టించిందంటే..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీ ఆడే పసికూన జట్లలో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) ఒకటి.

అయితే ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుతుందో లేదో చెప్పలేం కానీ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత ఆటను ప్రదర్శిస్తూ ఛాంపియన్ టీమ్స్ ను చిత్తుగా ఓడిస్తూ చరిత్రలో నిలిచిపోయే అద్భుత విజయాలను సాధిస్తోంది.

ఏ టోర్నీలో అయిన పసికూన జట్లు సెమీఫైనల్ చేరడం కష్టమే కానీ ఏ జట్లు సెమీ ఫైనల్ చేరాలో డిసైడ్ చేయగలవు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదే చేస్తోంది.

ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాల గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టును( England ) పసికూన జట్టు లాగా ఏకంగా 68 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘనవిజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.తాజాగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును( Pakistan ) కూడా చిత్తుగా ఓడించింది.

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల దూకుడును పాకిస్తాన్ బౌలర్లు అడ్డుకట్ట వేయలేక చేతులు ఎత్తేయడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఆఫ్ఘఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ 2023 టోర్నీలో గెలిచింది రెండు మ్యాచ్లే అయినా ఎన్నో సరికొత్త రికార్డులు జట్టు ఖాతాలో పడ్డాయి.అవి ఏమిటో చూద్దాం.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అంతేకాదు ప్రపంచ కప్ లో ( World Cup ) ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్లలో విజయం సాధించడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.గతంలో జరిగిన ప్రపంచ కప్ లలో ఆఫ్ఘనిస్తాన్ ఎన్నడూ కూడా రెండు విజయాలను సాధించలేకపోయింది.

ఈ టోర్నీలో రెండు విజయాలను సాధించిన ఆఫ్గనిస్తాన్ జట్టు మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది.జట్టు దూకుడు చూస్తుంటే నాలుగు మ్యాచ్లలో కనీసం రెండు అయినా గెలిచే అవకాశాలు లేకపోలేదు.వన్డే వరల్డ్ కప్ లో తొలిసారిగా ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు 50+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వన్డే ఫార్మాట్ లో టాప్ 3 ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అర్థ సెంచరీలు చేయడం ఇది మూడోసారి.ఈ టోర్నీలో సెమీ ఫైనల్ చేరే జట్ల ఫలితాలను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కచ్చితంగా తారుమారు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు