ఆ పని చెయ్యాలనుంది.. అందుకే డైరెక్ట్ గా అడిగేశాను: విద్యాబాలన్

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ నటి అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

బాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది.కాగా విద్యాబాలన్ 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈమె తన 44వ వసంతంలోకి అడుగు పెట్టింది.

న్యూ ఇయర్ వేడుకలతో పాటు తన పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది విద్యాబాలన్.విద్యాబాలన్ పుట్టినరోజు కావడంతో పలువురు ప్రముఖులు అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Actress Vidya Balan Said Shamelessly Asked Gulzar Work Her Details, Vidya Balan,

ఇది ఇలా ఉంటే విద్యాబాలన్ కెరిర్ లో ఎదురైన కొన్ని అనుభవాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకోగా అందుకు సంబంధించిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

దేవుడి దయవల్ల నా అవసరాలు తీరాలి.నా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు.

మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్.నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను.

కానీ ఎప్పుడూ కూడా దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు.నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తాను.

Actress Vidya Balan Said Shamelessly Asked Gulzar Work Her Details, Vidya Balan,
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది.నేను దర్శకుడు గుల్జార్ సాహెబ్ తో కలిసి పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడం తెలిసింది.

Advertisement

చాలాసార్లు గుల్జార్ సాబ్ తో కలసి ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజీయే మేరే సాత్ అని సిగ్గు లేకుండా అడిగేసాను.నేను ఉడి అలెన్ తో కూడా పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.

ఇకపోతే విద్యాబాలన్ ప్రస్తుతం నటుడు ప్రతీక్ గాంధీ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.అందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు.

తాజా వార్తలు