గ్లామర్ పాత్రలు చేయడానికి నేను రెడీ అంటున్న హీరోయిన్

సందీప్ కిషన్ కి జోడీగా బీరువా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సురభి.

ఈ అమ్మడు అందంగా ఉన్న అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదనే చెప్పాలి.

తెలుగులో ఆరు సినిమాల వారాలకు చేసిన ఈ అమ్మడుకి జెంటిల్మన్ సినిమా రూపంలో మంచి హిట్ పడింది.మంచు హీరోలకి జోడీగా ఎటాక్, ఓటర్ సినిమాలు చేసింది.

Actress Surabhi Ready To Glamour Roles, Tollywood, South Cinema, Sashi Movie, Ad

అందులో ఎటాక్ డిజాస్టర్ అయ్యింది.ఓటర్ రిలీజ్ కి దూరమైంది.

ఇక అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే ప్రయోగాత్మక సినిమాలో నటించింది.ఇందులో పరవాలేదనిపించుకున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

Advertisement

ప్రస్తుతం ఈ ఆది సాయి కుమార్ కి జోడీగా శశి అనే సినిమాలో నటించింది.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా తన కెరియర్ గురించి సురభి ఆసక్తికర వాఖ్యలు చేసింది.సినిమాలలో గ్లామర్ పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అలాంటి పాత్రలు నా వరకు రావడం లేదని చెప్పింది.

కొన్ని సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసిన కూడా అవి డిజాస్టర్ అవ్వడంతో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పింది.నాకు అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేయడంతో పాత్రల పరంగా కూడా డిఫరెంట్ గా ప్రయత్నం చేయాలని ఉంది.

గ్లామర్ రోల్స్, ప్రత్యేకత ఉన్న పాత్రలు ఇస్తే ప్రూవ్ చేసుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని సురభి చెప్పుకొచ్చింది.తమిళంలో వరుసగా మూడు సినిమాలు చేయడం వలన తెలుగు సినిమాలకి గ్యాప్ వచ్చింది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అలాగే కన్నడలో స్టార్ హీరో గణేష్ తో ఒక సినిమా చేస్తున్నా.శశి సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా తన కెరియర్ స్పీడ్ అందుకుంటుంది అని సురభి ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు