భగవంతుడు తారక్ ను చల్లగా చూడాలన్న సుధ.. కాలు బెణికితే అలా చేశాడంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పుకుంటారనే సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడని ఆమె కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ను వారు అని సంబోధించాలని సుధ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ సెట్ కు వస్తే సెట్ గోలగోలగా ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు.షూటింగ్ సెట్ లో తారక్ తెగ అల్లరి చేసేవారని అదే సమయంలో తారక్ హుందాగా ఉండేవారని సుధ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినా అందరితో కలివిడిగా ఉండటానికి ఇష్టపడేవారని సుధ కామెంట్లు చేశారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో బాద్ షా షూట్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నా కాలు బెణికిందని సుధ వెల్లడించడం గమనార్హం.

Advertisement

ఆ సమయంలో నా కాలు వాచిపోయిందని సుధ అన్నారు.ఆ సమయంలో తారక్ పరుగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేశాడని సుధ కామెంట్లు చేయడం గమనార్హం.

స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు ఇదంతా చేయాల్సిన అవసరం లేదని సుధ కామెంట్లు చేయడం గమనార్హం.ఏ బాబు చూడండని ఇతరులకు తారక్ చెప్పవచ్చని సుధ వెల్లడించారు.ఇలాంటి ఘటనలు జరిగితే చాలామంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తారని సుధ పేర్కొన్నారు.

అయితే తారక్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని ఆమె అన్నారు.తారక్ ను భగవంతుడు చల్లగా చూడాలని సుధ చెప్పుకొచ్చారు.

సుధ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సుధ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను కచ్చితంగా సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు