నటి ప్రియాంక చోప్రా ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సినీ అభిమానులకు పరిచయం అక్కర లేని పేరు.

బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగి అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని హాలీవుడ్ లో సెటిల్ అయింది.

ఇక బాలీవుడ్ మీద దృష్టి తగ్గించి హాలీవుడ్ సినిమాలపై ప్రియాంక దృష్టి సారించింది.ఇక అక్కడ ఇటీవలే తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ప్రియాంక చోప్రా ఇల్లు గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.నటి ప్రియాంక చోప్రా ఇంటి ఖరీదు 144 కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమాచారం.

అంటే అమెరికాలో 20 మిలియన్ డాలర్లు.అయితే 144 కోట్ల రూపాయల విలువ గల ఈ విలాస భవంతిలో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని చెప్పవచ్చు.

Advertisement

చుట్టూ పర్వతాలు కనిపిస్తూ, దగ్గరలో ఒక ఈత కొలను, ఒక థియేటర్, తన పెంపుడు కుక్కలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన అమరిక, పైకప్పు కిటికీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విలాస భవంతిలో ఉండే సకల సౌకర్యాలు ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే భూతల స్వర్గం అని చెప్పవచ్చు.

అయితే తన కొత్త ఇంటిపై ప్రియాంక స్పందించింది.నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నంతవరకు నాకు ఈ ఇల్లు తప్ప నాకు వేరే ఏ ఆటవిడుపు లేదని ప్రియాంక తెలిపింది.

అయితే ఇప్పుడు ప్రియాంక ఇంటిపై ప్రియాంక అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.మా పీసీ రేంజ్ ఇది అంటూ ఇతర తారల అభిమానులకు ఛాలెంజ్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ప్రియాంక ఈ కొత్త ఇంటిపై నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు