ముద్దు పెట్టడానికి హీరో మొహమాటం, హీరోయిన్ సాయం     2017-01-06   01:14:41  IST  Raghu V

ఏ మాయ చేసావే సినిమా చూసే ఉంటారుగా. అందులో ఏకంగా పదిసార్లకు పైగా ముద్దుపెట్టుకుంటారు నాగచైతన్య – సమంత. ఎలాగో ప్రేమికులు కదా ఇబ్బంది ఏముంది అని తేలిగ్గా తీసిపారేయొద్దు, ఆ సినిమా సమయానికి వాళ్ళ గట్టిగా స్నేహితులు కుడా కాదు. ఇప్పుడు మరో సినిమాలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆ సినిమాలానే ఎక్కువ లిప్ లాక్స్ ప్లాన్ చేసాడు.

ఆ సినిమా పేరే “ఎన్నై నొకి పాయుమ్ తోటా”. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నితిన్ తో జోడికడుతున్న మెఘా ఆకాష్ హీరోయన్ గా నటిస్తోంది. ఇందులో గాఢమైన అధర చుంబన దృశ్యాలు ఉండటంతో ధనుష్ బాగా ఇబ్బందిపడుతున్నాడట. ఎందుకంటారా … ఎంతైన పెళ్ళైన మనిషి, అలాగని ముద్దు సన్నివేశాలు అలవాటు లేక కాదు కాని, మెఘా కొత్త అమ్మాయి, తనతో చనువు లేకుండా రొమాంటిక్ సీన్స్ అంటే కష్టమే కదా.

కాని హీరోయిన్ మెఘా మాత్రం ధనుష్ లాగా ఇబ్బందిపడటం లేదట. నిజానికి, రొమాంటిక్ సీన్స్ బాగా రావటానికి ధనుష్ కి సహాయం కూడా చేస్తోందట. ఎంతైనా, కొత్త జెనరెషన్ యాక్టర్స్ బాగా ఫాస్ట్.