తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎన్నో కష్టాలు..

శ్రీవారి భక్తులు తిరుపతి, తిరుమల లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆదిభట్ల శ్రీ కళా పీఠం వ్యవస్థాపకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి వెల్లడించారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ లడ్డు నాణ్యత తగ్గిందని, లడ్డు రేటును తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.

తాగు నీటి కోసం గాజు గ్లాసులను కేటాయించి భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారని ఆమె వెల్లడించారు.తిరుమల లడ్డు కౌంటర్ లో చౌరీ భద్రత వైఫల్యమే కారణమని తెలిపారు.

వకుళామాత దేవాలయంలో చౌరీ భక్తులకు ఆవేదనను కలిగించిందని తెలిపారు.తిరుమల తిరుపతి లో పార్కింగ్ దందా మితిమీరి పోయిందని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు.

మాఢవీధులలో సీఎంఓ స్టిక్కర్ ఉన్న వాహనం తిరిగితే ఏమీ చర్యలు తీసుకున్నారు అని ఆమె ప్రశ్నించారు.తిరుమల దేవాలయం పై డ్రోన్స్ తిరగడం దేవాలయ పవిత్రతను దెబ్బతీస్తుందని రూ.500 జరిమానా వేసి డ్రోన్ కేసును మామ అనిపించేశారని కళ్యాణి విమర్శిస్తున్నారు.

Actress Karate Kalyani About Issues Facing By Tirumala Devotees Details, Actress
Advertisement
Actress Karate Kalyani About Issues Facing By Tirumala Devotees Details, Actress

తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణతోనే విధులకు హాజరుకావాలని ఆమె అన్నారు.టీటీడీ ఉద్యోగులు కచ్చితంగా తిరునామం ధరించి విధులకు హాజరవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.టీటీడీలో అన్యమాతస్తులను వెంటనే తొలగించాలని ఆమె వెల్లడించారు.

తిరుచానూరు పద్మాసరోవరం, గోవిందరాజస్వామి పుష్కరిణి దుర్గంధంగా మారిందని వెల్లడించారు.

Actress Karate Kalyani About Issues Facing By Tirumala Devotees Details, Actress

తిరుమల తిరుపతిలో ప్రవేట్ టాక్సీ మాఫియా భక్తులను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు.అలిపిరి వద్ద కొబ్బరికాయల విక్రయ దారుల మాఫియా రెచ్చిపోతుందని వెల్లడించారు.ధరల పట్టికలో ఉన్న విధంగా హోటల్స్ లో భక్తుల నుంచి వసూలు చేయడం లేదని వెల్లడించారు.

అధిక ధరలతో తిను బండారులను అధిక ధరలకు విక్రయిస్తున్న టీటీడీ ఏం చేస్తుందని ఆమె నిలదీశారు.సేవ్ తిరుమల పేరుతో భక్తులను, హిందూ సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు.

వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!
Advertisement

తాజా వార్తలు