ఈసారి ఎన్నికల్లో గెలిచిన సినీనటులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు !

ఎన్నికలకు రాజకీయాలకు ఎప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉంటూనే ఉంటాయి.2024 ఎలక్షన్స్ లో( 2024 Elections ) చాలామంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కొంతమంది అసెంబ్లీ స్థానాల కోసం పోటీపడితే మరి కొంతమంది పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం పోటీపడ్డారు.

మరి ఈసారి గెలిచి అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న ఆ తారలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇప్పుడు ఖచ్చితంగా ముందుగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రమే.

జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల కోసం పోటీ పడితే 100% సీట్స్ గెలుచుకుని తన సత్తా ఏంటో అందరికీ తెలియజేశాడు.

పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు.అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న రెండవ పార్టీగా కూడా జనసేన( Janasena ) అవతరించింది.ఇక హిందూపురం నుంచి మూడవసారి విజయం సాధించారు బాలకృష్ణ.

Advertisement

( Balakrishna ) హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకున్నారు.ఎవరు ఊహించని విధంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి బిజెపి పార్టీ తరఫున పోటీ చేసి గెలిచింది కంగనా రనౌత్.

( Kangana Ranaut ) ఈమె మన ప్రభాస్ తో ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది.ఇక అనేక తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ రచనా( Rachana ) తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచింది.

ఇవి పచ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ ప్రాంతంలో టీఎంసీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది.

ఇక కేరళ రాష్ట్రం లోని త్రిసూర్ ప్రాంతం నుంచి బిజెపి అభ్యర్థిగా సురేష్ గోపి( Suresh Gopi ) నిలబడి గెలుపొందారు.గోరఖ్ పూర్ నుంచి రవికిషన్( Ravi Kishan ) సైతం.గెలిచారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఈశాన్య ఢిల్లీ నుంచి నటుడు మనోజ్ తివారి( Manoj Tiwari ) గెలుపొందగా బిజెపి పార్టీ నుంచి హేమామాలని( Hema Malini ) మరోసారి సత్తా చాటింది.రామాయణం సీరియల్ నటుడైన అరుణ్ గోవిల్( Arun Govil ) మీరట్ కూడా గెలుపొందారు.

Advertisement

గతంలో ఎంపికైన నవనీత్ కౌర్( Navneet Kaur ) ఈసారి ఓటమి పాలు అవ్వక తప్పలేదు.అలాగే నటి రాధిక సైతం ఓడిపోయారు.

తాజా వార్తలు