నిరాశ్రయురాలును కాలుతో తన్నిన వుమన్ పోలీస్.. తర్వాతేమైందో చూస్తే..??

మనం చేసిన ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని, కర్మ ఫలితం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పెద్దలు చెబుతుంటారు.కొన్ని సంఘటనలు చూస్తే ఆ మాటలు నిజమనే అనిపిస్తుంది.

 Cop Kicks Homeless Woman Sitting By The Road Viral Video Details, Saree, Female-TeluguStop.com

తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా ఆ మాటలకు అంగీకరిస్తారు.ఈ వైరల్ వీడియోలో( Viral Video ) ఒక అభాగ్యవంతురాలు వీధి మూలలో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది.

ఆమె వికలాంగురాలు, నడవడానికి కూడా కష్టపడుతుంది.అదే సమయంలో, ఒక మహిళా ట్రాఫిక్ పోలీసు( Woman Traffic Police ) అధికారి బైక్‌పై వస్తుంది.

ఒక వ్యక్తి ఆమెను కూడలిలో దింపుతాడు.ఇద్దరు లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ అభాగ్యవంతురాలిని బలంగా తన్నడం వల్ల ఆమె కిందపడిపోతుంది.అధికారి దగ్గరలో ఉన్న వస్తువులను కూడా తన్నడం ప్రారంభిస్తుంది.తరువాత వీడియోలో, ఆ పోలీసు అధికారి( Police Officer ) స్పృహ కోల్పోయి, ఒక రోడ్డుపక్క పోల్‌ను తలబాదుకుంటుంది.

అక్కడే ఉన్న ఆ అభాగ్యవంతురాలు, ఆమెకు సహాయం చేయడానికి వెళ్తుంది.ఒక బాటిల్‌లోని వాటర్‌ను ఆమె ముఖంపై పోసి, ఆమెను స్పృహలోకి తీసుకువస్తుంది.ఆ అధికారి ఆ నిరాశ్రయురాలు సహాయంతోనే లేచి నిలబడుతుంది.

ఈ వీడియోకు 34 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, దాదాపు 1,51,000 లైక్స్‌ వచ్చాయి.అయితే, వీడియో చూసిన నెటిజన్లు కర్మను నమ్ముతున్నామని కామెంటు చేశారు.ఈ సంఘటన అధికారికి ఒక గుణపాఠంగా మారాలని కోరుకుంటున్నారు.

మరికొందరు ఈ వీడియో స్క్రిప్ట్ వీడియో అని, నిజ జీవితంలో పరిణామాలు తరచుగా భిన్నంగా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.ఒక వ్యాఖ్యాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సాటి మహిళను ఇలా ఎందుకు తన్నుతుంది అని ప్రశ్నించారు.

ఈ వీడియో స్క్రిప్టా? లేదంటే రియల్ వీడియోనా అనే సంగతి పక్కన పెడితే ప్రతి మనిషి పట్ల జాలి, దయ, కరుణ చూపించడం ముఖ్యమని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube