ఎన్నికలకు రాజకీయాలకు ఎప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉంటూనే ఉంటాయి.2024 ఎలక్షన్స్ లో( 2024 Elections ) చాలామంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.కొంతమంది అసెంబ్లీ స్థానాల కోసం పోటీపడితే మరి కొంతమంది పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం పోటీపడ్డారు.మరి ఈసారి గెలిచి అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న ఆ తారలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు ఖచ్చితంగా ముందుగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రమే.జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల కోసం పోటీ పడితే 100% సీట్స్ గెలుచుకుని తన సత్తా ఏంటో అందరికీ తెలియజేశాడు.
పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు.అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న రెండవ పార్టీగా కూడా జనసేన( Janasena ) అవతరించింది.ఇక హిందూపురం నుంచి మూడవసారి విజయం సాధించారు బాలకృష్ణ.( Balakrishna ) హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకున్నారు.ఎవరు ఊహించని విధంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి బిజెపి పార్టీ తరఫున పోటీ చేసి గెలిచింది కంగనా రనౌత్.( Kangana Ranaut ) ఈమె మన ప్రభాస్ తో ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది.
ఇక అనేక తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ రచనా( Rachana ) తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచింది.ఇవి పచ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ ప్రాంతంలో టీఎంసీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది.
ఇక కేరళ రాష్ట్రం లోని త్రిసూర్ ప్రాంతం నుంచి బిజెపి అభ్యర్థిగా సురేష్ గోపి( Suresh Gopi ) నిలబడి గెలుపొందారు.గోరఖ్ పూర్ నుంచి రవికిషన్( Ravi Kishan ) సైతం.గెలిచారు.ఈశాన్య ఢిల్లీ నుంచి నటుడు మనోజ్ తివారి( Manoj Tiwari ) గెలుపొందగా బిజెపి పార్టీ నుంచి హేమామాలని( Hema Malini ) మరోసారి సత్తా చాటింది.
రామాయణం సీరియల్ నటుడైన అరుణ్ గోవిల్( Arun Govil ) మీరట్ కూడా గెలుపొందారు.గతంలో ఎంపికైన నవనీత్ కౌర్( Navneet Kaur ) ఈసారి ఓటమి పాలు అవ్వక తప్పలేదు.
అలాగే నటి రాధిక సైతం ఓడిపోయారు.